Moviesచెర్రీకి ప్ర‌భాస్ షాక్‌... ఎన్టీఆర్‌, బ‌న్నీ నా బెస్ట్ ఫ్రెండ్స్‌..

చెర్రీకి ప్ర‌భాస్ షాక్‌… ఎన్టీఆర్‌, బ‌న్నీ నా బెస్ట్ ఫ్రెండ్స్‌..

దేశవ్యాప్తంగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా ఫీవ‌ర్‌ నడుస్తుంది. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ ఒక్క సారిగా నేషనల్ స్టార్ గా మారిపోయాడు. ప్రభాస్ సినిమా వస్తుందంటే కేవలం తెలుగు సినిమా ప్రేక్షకులే కాదు… కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ప్రభాస్ సినిమా కోసం ఎగ్జైట్‌మెంట్తో వెయిట్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో సుజీత్‌ డైరెక్షన్లో డైరెక్షన్ లో తెర‌కెక్కిన ఈ సినిమా ఆగ‌స్టు 30న రిలీజ్ అవుతుంది. ప్ర‌స్తుతం ప్రభాస్ సాహో ప్రమోషన్లలో బిజీబిజీగా ఉన్నాడు. ఈ క్రమంలోనే ఓ తమిళ ఇంటర్వ్యూలో తెలుగు యంగ్ హీరోలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

తెలుగులో తనకు తన తోటి కో స్టార్ట్స్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ చాలా సన్నిహితులని చెప్పాడు. తనకు ఈ ఇద్ద‌రితో చాలా ఏళ్లుగా మంచి రిలేషన్ ఉందని చెప్పాడు. అదే టైంలో రామ్చరణ్ విషయంలో మాత్రం కాస్త షాకింగ్ గానే మాట్లాడాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం సమయంలోనే తనకు రామ్ చరణ్ కాస్త క్లోజ్ అయ్యాడ‌ని… భవిష్యత్తులో చరణ్ మ‌రింత స‌న్నిహితం అవ్వొచ్చేమోన‌ని చెప్పాడు.

ప్ర‌భాస్ ఎన్టీఆర్‌, బ‌న్నీ విష‌యంలో చాలా క్లోజ్ అన్న‌ట్టుగా చెప్పి చ‌ర‌ణ్ విష‌యంతో అంత క్లోజ్ కాద‌న్న‌ట్టుగా చెప్ప‌డంతో అటు ఎన్టీఆర్‌, బ‌న్నీ ఫ్యాన్స్ బాగా సంబ‌రాలు చేసుకుంటుంటూ చ‌ర‌ణ్‌ను ఆటాడుకుంటున్నారు. మ‌రి దీనిపై చెర్రీ ఫ్యాన్స్ నుంచి ఎలాంటి స్పంద‌న వ‌స్తుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news