Moviesపవన్ కోసం వంద కోట్లు.. ఫ్యాన్సా మజాకా..!

పవన్ కోసం వంద కోట్లు.. ఫ్యాన్సా మజాకా..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల ఎన్నికల్లో షాకింగ్ రిజల్ట్ రావడంతో ప్రస్తుతం జనసేన పార్టీని బలపరిచేందుకు ప్రయత్నిస్తున్నాడు. అయితే పవన్ ఫ్యాన్స్‌ మాత్రం పవన్ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎలాంటి రాజకీయ పార్టీ అయినా డబ్బు లేకుండా ముందుకు సాగాలంటే కష్టమని అంటున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ జనసేనకు ఫండ్స్ ఇచ్చేందుకు పెద్ద తలకాయలే ముందుకు వచ్చాయి. కానీ వారు ఏదో ఆశిస్తారని పవన్ వారిని దూరం పెట్టారు.

ఇప్పుడు చేతిలో డబ్బులు లేకపోవడం.. సినిమాలు చేయకపోవడంతో పవన్ జనసేనను ఎలా నడిపిస్తారా అని పవన్ ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు. దీంతో వారంతా కలిసి సోషల్ మీడియా వేదికగా ఒక తాటిపైకి వచ్చారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 నాటికి వారి అభిమాన హీరోకు, జనసేన పార్టీ కోసం ఏకంగా రూ.100 కోట్ల ఫండ్‌ను టార్గెట్ చేశారు. #JanasenaDonationsDay అనే హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాలో వారు ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారు.

ఈ విధంగా తమ హీరో పార్టీని తామే ఆదుకుంటామని జనసైనికులు ముందుకు వచ్చారు. ఈ అడుగు చాలా గొప్పదని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అభిమానులే పార్టీ కోసం ఇలా డబ్బులు పోగు చేయడం ఆ పార్టీ మనుగడకు చాలా శుభసూచకం అని అంటున్నారు. మరి పవన్ ఫ్యాన్స్ టార్గెట్ ఎంతమేర రీచ్ అవుతారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news