సైరా విడుద‌ల‌పై క్లారీటి ఇచ్చిన మెగాస్టార్‌…!

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి సినిమా విడుద‌ల ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి అభిమానుల‌కు తీపిక‌బురును అందించాడు. ఈ సినిమా విడుద‌ల తేదిని అధికారికంగా ఇంత‌కాలం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డంతో ఎప్పుడు అప్‌డేట్ వ‌స్తుందా… చిత్ర యూనిట్ ఎప్పుడు విడుద‌ల తేదిని ప్రక‌టిస్తారా… అని ఎదురుచూపుల‌కు మెగాస్టార్ కోడ‌లు శుభం కార్డు వేసింది.

భార‌తదేశానికి స్వాతంత్య్రం కోసం జ‌రిగిన పోరులో మొద‌టి తిరుగుబాటు యోధుడు ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డి జీవిత క‌థ‌ను మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కిస్తున్న చిత్రం సైరా న‌ర‌సింహారెడ్డి. ఈ సినిమాని ఎప్పుడు విడుద‌ల చేస్తారో ఇంత‌వ‌ర‌కు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించ‌లేదు. అనేక డేట్లు సోష‌ల్‌మీడియాలో పుకార్లు షికార్లు చేశాయి కానీ చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి స్పంద‌న లేదు.

అయితే మెగాస్టార్ చిరంజీవి కోడ‌లు ఉపాస‌న త‌న సొంత మేగ‌జైన్‌కు త‌న మామ చిరంజీవిని ఇంట‌ర్వ్యూ తీసుకుంది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి స్వ‌యంగా ఈ సినిమా దేశానికి స్వాతంత్య్రం కోసం పోరాటం చేసిన మ‌హాత్ముడు మ‌హాత్మ‌గాంధీ జ‌యంతి అక్టోబ‌ర్‌2న విడుద‌ల చేయ‌డం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంద‌ని అన్నాడు. అంటే ఉపాస‌న త‌న మామ నోటితోనే అక్టోబ‌ర్ 2న విడుద‌ల చేస్తున్న‌ట్లు చెప్పించారు. అయితే ఈ సినిమాను ఉపాస‌న భ‌ర్త‌, మెగాస్టార్ చిరంజీవి త‌న‌యుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న సొంత బేన‌ర్ కొణిదేల ప్రోడక్ష‌న్ కంపెనీలో నిర్మిస్తున్నాడు. సో మెగా అభిమానుల‌కు సైరా విడుద‌ల తేది తెలిసిపోయింది..

Leave a comment