‘ మ‌న్మథుడు 2 ‘ ఏరియా వైజ్ ప్రి రిలీజ్ బిజినెస్‌

టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున – రకుల్ ప్రీత్ కాంబోలో తెరకెక్కిన మన్మధుడు 2 సినిమా రేపు శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా తెరకెక్కిన ఈ సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. కింగ్ నాగార్జున గ‌త సినిమాలు ప్లాప్ అయినా మ‌నోడు ఇప్పుడు బిగ్‌బాస్ 3 హోస్ట్‌గా దూకుడు మీద ఉండ‌డంతో బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు కూడా మ‌రింత‌గా ద‌గ్గ‌రైపోయాడు.

అటు మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు, ఇటు బిగ్‌బాస్ – 3 హోస్ట్‌గా చేస్తుండ‌డంతో నాగ్ చాలా మంది న్యూట్ర‌ల్ అభిమానుల‌ను కూడా సొంతం చేసుకున్నారు. ఇక మ‌న్మ‌థుడు సినిమాకు సీక్వెల్‌గా వ‌స్తుండ‌డంతో చాలా మంది ఈ సినిమాపై అంచ‌నాల‌తో ఉన్నారు. సినిమా మీదున్న అంచనాలతో వరల్డ్ వైడ్ గా మన్మధుడు 2 బాగానే అమ్ముడు పోయింది. ఇక ఈ సినిమాకి లాంగ్ వీకండ్ కూడా కలిసొచ్చేలా కనబడుతుంది.

ఈ సినిమాకు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ 20.50 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జ‌రిగింది. ఏరియాల వారీగా బిజినెస్ ఇలా ఉంది.

మ‌న్మథుడు 2 ఏరియా ప్రీ రిలీజ్ (రూ.కోట్ల‌లో)

నైజాం – 7

సీడెడ్ – 2.5

ఆంధ్ర – 7
————————
ఏపీ + టీస్ = 16.5
————————

రెస్టాఫ్ ఇండియా – 1.60

ఓవ‌ర్సీస్ – 2.40
———————————-
వరల్డ్ వైడ్ టోటల్ = 20.50
———————————-

Leave a comment