మన్మథుడు 2 వర్సెస్ కథనం.. పొటీలో గెలిచిందెవరు..?

కింగ్ నాగార్జున హీరోగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వచ్చిన సినిమా మన్మథుడు 2. నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్ సినిమాగా నిలిచిన క్లాసిక్ మూవీ మన్మథుడు సినిమా టైటిల్ ను వాడుతూ మన్మథుడు 2 తెరకెక్కించారు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా టాక్ అంత గొప్పగా లేదని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకు పోటీగా అనసూయ లీడ్ రోల్ లో కథనం సినిమా వచ్చింది. రాజేష్ నాదెండ్ల డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని కలిగించింది.

నాగార్జునతో పోటీ పడేంత సీన్ లేకున్నా అనసూయ కథనం కూడా సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ రెండు సినిమాల్లో నాగార్జున వెనుకపడ్డాడని చెప్పొచ్చు. అయితే అనసూయ కథనం సినిమా కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే మిస్సవడం వల్ల సినిమా పెద్దగా మెప్పించలేదని తెలుస్తుంది. ఫైనల్ గా ఈ రెండు సినిమాల్లో రెండు ఆడియెన్స్ ను నిరాశపరచాయి.

అయితే నాగ్ సినిమా యూత్ ఆడియెన్స్ మెచ్చే అంశాలు ఉన్నాయి. ఈ సినిమాలో నాగార్జున స్టైలిష్ లుక్ ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసింది. సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా హాట్ లుక్స్ లో అలరించింది. ఫైనల్ గా మన్మథుడు 2, కథనం సినిమాల్లో ఏది సేఫ్ ప్రాజెక్ట్ అవుతుందో చూడాలి.

Leave a comment