కార్తీకేయ ‘ గుణ 369 ‘ ప్రి రివ్యూ

ఆర్ఎక్స్ 100 సినిమాతో ఓవ‌ర్‌నైట్ క్రేజీ హీరోగా మారిపోయాడు కార్తీకేయ‌. ఈ సినిమాలో కార్తీకేయ న‌ట‌న‌తో పాటు హీరోయిన్ పాయ‌ల్ రాజ్‌పుత్ ఎక్స్‌పోజింగ్‌తో సినిమాకు వీర బ‌జ్ వ‌చ్చేసింది. ఈ సినిమాతో కార్తీకేయ ఒక్క‌సారిగా యూత్‌లో కాస్తో కూస్తో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈ క్ర‌మంలోనే కార్తీకేయ న‌టించిన హిప్పీ ఇటీవ‌లే రిలీజ్ అయ్యింది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఆ సినిమాను ప్రేక్ష‌కులు తిర‌స్క‌రించారు.

ఇక ఇప్పుడు స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే కార్తీకేయ మ‌రోసారి ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. గుణ 369. కార్తికేయ హీరోగా నటించిన ఈ సినిమాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. సినిమా కథ చాలా బాగుందని, యాక్షన్ ఎపిసోడ్స్, ట్విస్టులు అదిరిపోయాయంటూ ఇండస్ట్రీ నుంచి ఫీలర్లు వదుల్తున్నారు. ట్రయిలర్ చూస్తుంటే అంత మేటర్ ఉన్నట్టు కనిపించడం లేదు కానీ వస్తున్న ఫీలర్లు మాత్రం భారీగా ఉంటున్నాయి.

ట్రైలర్ చూస్తే రొటీన్‌గానే ఉంది. మొబైల్ షాప్‌లో హీరోయిన్‌ని చూసి తొలి చూపులోనే ప్రేమలోనే పడటం.. ఆ ప్రేమకు అడ్డంకులు ఏర్పడటం.. ఆ అడ్డంకుల్ని అధిగమించడానికి కత్తి పట్టి విలన్లను ఉతికి ఆరేయడం ఇదంతా ప‌ర‌మ రొటీన్‌గానే ఉంది. ఫస్టాఫ్‌లో చాలా కూల్‌గా ఉన్న హీరో.. సెకండాఫ్ ఉగ్ర రూపం దాల్చడం.. ఫైట్లు చేస్తుంటే విలన్లు ఎగిరెగిరి పడటం.. గోడ‌లు కూలిపోవ‌డం… అద్దాలు ప‌గిపోవ‌డం ఈ తంతు అంతా చాలా రొటీన్ మాస్ సినిమాగానే క‌నిపిస్తోంది.

మొత్తానికి క‌థా ప‌రంగా కొత్త‌ద‌నం లేదు… ఇక ట్రీట్‌మెంట్ ఎలా ? ఉంటుందో ? చూడాల్సి ఉంది. ఈ సినిమా హిట్ అయితే కార్తీకేయకు మ‌రో మూడు నాలుగు సినిమాల వ‌ర‌కు మంచి క్రేజ్ ఉంటుంది. లేక‌పోతే రేసులో బాగా వెన‌క్కి వెళ్లిపోతాడు. మ‌రి కార్తీకేయ జాత‌కం కొద్ది గంట‌ల్లోనే తేలిపోనుంది.

Leave a comment