ఎవరు కలెక్షన్స్.. పాపం అడివి శేష్!

ఇటీవల రిలీజ్ అయిన సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు ప్రేక్షకులను అలరించడంలో ఫుల్ సక్సెస్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద చెడుగుడు ఆడుతుందని చిత్ర యూనిట్ కూడా ధీమా వ్యక్తం చేశారు. అయితే అందరి అంచనాలు తలకిందలు చేసింది ఈ చిత్ర కలెక్షన్లు. మంచి పాజిటివ్ రివ్యూలతో పాటు అదిరిపోయే మౌత్ టాక్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్లతో అడివి శేష్ బిత్తరపోయాడు.

తొలి రోజు సినిమాకు అదిరిపోయే టాక్ రావడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అదే స్థాయిలో కలెక్షన్స్ రాబట్టడంతో వారి అంచనాలు నిజమయ్యేలా కనిపించాయి. కానీ వీకెండ్ తరువాత ఈ సినిమా కలెక్షన్ల జోరును కొనసాగించడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో ఈ సినిమా కాస్త బ్లాక్ బస్టార్ రేంజ్ నుండి హిట్ రేంజ్‌కు పడిపోయింది. సినిమా రిలీజ్ అయ్యి 11 రోజులు ముగిసే సరికి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.9.83 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ సినిమా హిట్‌గా మాత్రమే పరిగణించబడుతుందని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. ఇక ఈ సినిమా 11 రోజుల ఏరియాల వారీ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 11 రోజలు కలెక్షన్స్
నైజాం – 3.40 కోట్లు
సీడెడ్ – 0.82 కోట్లు
నెల్లూరు – 0.18 కోట్లు
కృష్ణా – 0.61 కోట్లు
గుంటూరు – 0.49 కోట్లు
వైజాగ్ – 1.07 కోట్లు
తూ.గో – 0.53 కోట్లు
ప.గో – 0.33 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 7.43 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.85 కోట్లు
ఓవర్సీస్ – 1.55 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్ షేర్ కలెక్షన్స్ – 9.83 కోట్లు

Leave a comment