Moviesబల్బు వెలిగిందంటున్న బెల్లం బాబు!

బల్బు వెలిగిందంటున్న బెల్లం బాబు!

భారీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్.. తన ప్రతి సినిమాలో భారీతనాన్ని మిస్ కాకుండా చూస్తాడు. అయితే మనోడు ఎంత భారీతనం ప్రదర్శించిన ఒక్క భారీ హిట్ కూడా అందుకోలేకపోయాడు. కాగా ఇప్పుడు మనోడు తన తాజా చిత్ర ‘రాక్షసుడు’ సినిమాను రిలీజ్‌కు రెడీ చేశాడు. అయితే ఈ సినిమా చేసిన తర్వాతే మనోడికి బల్బు వెలిగిందంటున్నాడు.

వరుసగా భారీ సినిమాలు చేసి వాటిని భారీ విజయాలుగా మార్చలేకపోవడంతో నిర్మాతలు నష్టాల బారిన పడ్డారని.. ఇకపై కేవలం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు మాత్రమే తక్కువ బడ్జెట్‌లో తీస్తానంటున్నాడు ఈ హీరో. మనోడి నిర్ణయంతో ప్రొడ్యూసర్లు చాలా హ్యాపీగా ఉన్నారట. గొప్పలకు పోయి తిప్పలు తెచ్చుకునేకంటే.. మంచి సత్తా ఉన్న సినిమా చేసి నాలుగు రాళ్లు వెనకేసుకుంటే చాలు అంటున్నారు. ఏదేమైనా మనోడికి బల్బు కాస్త ఆలస్యంగా వెలిగిందంటున్నారు సినీ జనాలు.

అటు రాక్షసుడు సినిమాపై బెల్లంకొండ బాబు మామూలు కాన్ఫిడెంట్‌గా లేడు. తమిళంలో సూపర్ సక్సె్స్ కొట్టిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు ఎంతమేర నచ్చుతుందో తెలియాలంటే మరో రోజు ఆగాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news