అన‌సూయ ‘ క‌థ‌నం ‘ ప్రీ – రివ్యూ

హాట్ యాంక‌ర్ అన‌సూయ అటు బుల్లితెర‌తో పాటు ఇటు వెండితెర మీద కూడా మంచి పెర్పామెన్స్‌తో కూడిన పాత్ర‌ల‌తో ఆక‌ట్టుకుంటోంది. సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాతో ప్రారంభ‌మైన ఆమె దూకుడు క్ష‌ణం, రంగ‌స్థ‌లం, యాత్ర‌ లాంటి సినిమాల‌తో కంటిన్యూ అయ్యింది. తాజాగా ఆమె న‌టించిన క‌థ‌నం సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఇటీవ‌ల కాస్త గ్యాప్ తీసుకుని ఆమె లేడీ ఓరియంటెడ్ రోల్లో న‌టించిన సినిమా కావ‌డంతో ఓ మోస్త‌రు అంచ‌నాలే ఉన్నాయి.

మ‌రో వైపు నాగార్జున మ‌న్మ‌థుడు 2, విశాల్ అయోగ్య (తెలుగు టెంప‌ర్ రీమేక్‌), క‌న్న‌డ డ‌బ్బింగ్ మూవీ కురుక్షేత్రం లాంటి సినిమాలు కూడా రేసులో ఉన్నాయి. గాయ‌త్రీ ఫిలింస్ బ్యాన‌ర్‌పై తెర‌కెక్కిన ఈ సినిమా స‌స్పెన్స్‌, థ్రిల్ల‌ర్ ఎలిమెంట్స్‌తో తెర‌కెక్కింది. ద‌ర్శ‌కుడు రాజేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. సినిమా కంటెంట్‌పై న‌మ్మ‌కంతో అన‌సూయ ప్ర‌మోష‌న్స్ విష‌యంలో బాగా క‌ష్ట‌ప‌డింది.

ఇక టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌కు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా గురించి అనసూయ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. ముఖ్యంగా ట్రైలర్ లాంఛ్ వేడుకలో మాట్లాడుతూ తను సినిమా యూనిట్‌ను చాలా ఇబ్బంది పెట్టానని.. ద‌ర్శ‌కుడు రాజేష్‌తో వర్క్ చేయడం చాలా బాగుంద‌ని కూడా చెప్పింది. సినిమాలో కంటెంట్ అల్టిమేట్‌గా ఉంద‌ని… కంటెంట్ వ‌ల్లే రేపు సినిమా హిట్ అవుతుంద‌న్న ధీమా కూడా వ్య‌క్తం చేసింది.

కథనం సినిమాలో అనసూయ ఒక దర్శకురాలి పాత్రలో నటించింది. ఆమె ఓ సినిమా కోసం అనుకున్న కథనం కాస్తా నిజ జీవితంలో జరగుతూ ఉంటే ఏం జ‌రిగింద‌న్న స‌స్పెన్స్‌తో ద‌ర్శ‌కుడు రాజేష్ నాదెండ్ల ఈ సినిమా తెర‌కెక్కించాడు. ఈ సినిమాలో ఇతర ముఖ్యపాత్రలో అవసరాల శ్రీనివాస్, ధ‌న‌రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్యపాత్రల్లో నటించారు. మ‌రి సినిమా ఎలా ? ఉంటుందో ? రేపు తేలిపోనుంది.

Leave a comment