హీరోలు తాగితే తప్పులేదు.. నేను తాగితే తప్పా..!

నాగార్జున, రకుల్ జంటగా రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మన్మథుడు 2. అన్నపూర్ణ బ్యానర్ లో నాగార్జున స్వయంగా నిర్మించిన ఈ సినిమాలో రకుల్ రెచ్చిపోయి మరి నటించింది. ప్రచార చిత్రాల్లో భాగంగా రకుల్ ఓ సీన్ లో స్మోకింగ్ చేస్తుంది. సినిమా ప్రమోషన్స్ లో రకుల్ ను ఈ సినిమాలో మీరు బోల్డ్ గా నటించారని అడిగితే సిగరెట్ తాగితే బోల్డ్ నెస్ అన్నట్టా.. అయినా హీరోలు సిగరెట్ తాగితే తప్పులేదు హీరోయిన్స్ తాగితే తప్పేంటి.

మందు, సిగరెట్ తాగినప్పుడు స్క్రీన్ పై స్లైడింగ్ వేస్తూనే ఉంటారు. హీరోలు ఏం చేసినా చెల్లుతుంది కాని హీరోయిన్ సిగరెట్ తాగితే మాత్రం సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుకొస్తాయని అంటుంది. కేవలం సినిమాలో పాత్ర స్వభావం కోసం అలా చేస్తామని అలా చేసినంత మాత్రానా వాటిని ఎంకరేజ్ చేసినట్టు కాదని చెప్పింది రకుల్. ఈమధ్య రకుల్ పై నెగటివ్ ట్రోల్స్ ఎక్కువయ్యాయి వాటి గురించి కూడా ట్రోల్స్ చేసే వారికి పనిపాట లేదేమో కాని తనకు వాళ్లని పట్టించుకునే టైం లేదని చెప్పుకొచ్చింది.

స్పైడర్ తర్వాత రకుల్ కెరియర్ రిస్క్ లో పడినట్టు అనిపించగా.. మన్మథుడు 2తో మళ్లీ ఆమె ఫాం లోకి రావాలని చూస్తుంది. నాగార్జున సరసన నటించినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే.. ఈ సినిమాలో తను నటించడం అదృష్టమని నాగ్ సార్ నుండి చాలా విషయాలను నేర్చుకున్నానని అన్నది రకుల్. మరి మన్మథుడు 2 రకుల్ కు హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Leave a comment