వరంగల్ హత్య కేసులో సంచలన నిర్ణయం.. ప్రవీణ్ కు ఉరిశిక్ష..!

జూన్ 10న వరంగల్ లో 9 నెలల పాప శ్రీహిత మీద జరిగిన హత్య కేసులో సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ విచారిస్తున్న ఈ కేసు గురించి న్యాయమూర్తి కె.జయకుమార్ అతనికి ఉరి శిక్ష విధించమని తీర్పు ఇచ్చారు. ముక్కుపచ్చలారని పసిపాప మీద అత్యచారం, హత్య చేసిన ప్రవీణ్ కు ఉరి శిక్ష సరైనది న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

అత్యాచారం జరిగిన 48 రోజుల్లోనే తీర్పు రావడం నింధుతుడికి ఉరి శిక్ష విధించడం కూడా ఇదే మొదటిసారి. అత్యాచారం, హత్యల విషయంలో పోలీసులు, న్యాయస్థానం ఇలానే వేగంగా స్పందిస్తే ఇలాంటివి ఇక మీదట జరుగకుండా ఉండే అవకాశం ఉంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దేశంలో ఈ అత్యాచార ఘటనలు ఎక్కువయ్యాయి. అందుకే వరంగల్ న్యాయస్థానం ఉరి శిక్ష తీర్పుతో సంచలనం సృష్టించింది.

ఇక మీద ఎవరైనా అలాంటి ఆలోచన చేసినా సరే వారికి ఇలాంటి శిక్షే పడుతుందని వారు హెచ్చరించినట్టే. ఫైనల్ గా శ్రీహిత ఫ్యామిలీకి జరిగిన అన్యాయానికి న్యాయస్థానం సరైన న్యాయం చేసిందని చెప్పొచ్చు. ప్రవీణ్ తనంతట తాను తప్పు ఒప్పుకోవడం వల్ల తీర్పు సులభం అయ్యింది. న్యాయవాదులెవరు ప్రవీణ్ తరపున వాధించడానికి ఒప్పుకోకపోవడం కూడా త్వరగా తీర్పు వచ్చేందుకు కృషి చేసింది.

Leave a comment