Moviesమ‌హేష్ ' మ‌హ‌ర్షి ' 100 డేస్ సెంట‌ర్స్ లిస్ట్‌

మ‌హేష్ ‘ మ‌హ‌ర్షి ‘ 100 డేస్ సెంట‌ర్స్ లిస్ట్‌

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ హీరోగా దర్శకుడు వంశీ డైరెక్ట్ చేసిన చిత్రం మహర్షి. ఈ స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ సినిమా మాంచి సోష‌ల్ కాన్సెఫ్ట్‌తో తెర‌కెక్కి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా సొంతం చేసుకుంది. ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక రికార్డులు తిర‌గ‌రాసి త‌న ఖాతాలో వేసుకుంది.
ముఖ్యంగా నైజాం లో మహర్షి 30కోట్లకు పైగా షేర్ సాధించి రికార్డు నమోదు చేసింది.

ఇక తాజాగా మ‌హ‌ర్షి ఏపీలో ఐదు సెంట‌ర్ల‌లో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఐదు సెంట‌ర్ల‌లో మూడు డైరెక్ట్ వందల రోజుల ప్రదర్శించబడిన థియేటర్స్ కాగా… మరో రెండు షిఫ్టెడ్ సెంటర్స్. ఈ ఐదు సెంట‌ర్ల‌ను చూస్తే వైజాగ్, చిలకలూరిపేట, ఆదోని సెంటర్ల‌లో మహర్షి నేరుగా వంద రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంది.

ఇక మ‌హేష్ సినిమాకు అడ్డాగా ఉన్న గుంటూరుతో పాటు నెల్లూరులో మాత్రం షిఫ్టెడ్ థియేటర్లలో వంద రోజులు ఆడింది. ప్రస్తుత పరిస్థుతుల దృష్ట్యా ఇది చెప్పుకోదగ్గ విషయమే. మహర్షి మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే నటించగా, అల్లరి నరేష్ కీలక పాత్ర చేశారు.మహేష్ ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రం తరువాత మళ్ళీ ఆయన వంశీ పైడిపల్లి చిత్రంలో నటించే యోచనలో ఉన్నారని తెలుస్తుంది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news