బన్నితో గొడవకు దిగుతున్న నవదీప్.. అందుకే సిక్స్ ప్యాక్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైర్క్షన్ లో వస్తున్న సినిమా సెట్స్ మీద ఉంది. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్, నివేదా పేతురాజ్ కూడా ఈ సినిమాలో నిర్మిస్తున్నారు. నాన్న నేను టైటిల్ ప్రచారంలో ఉన్న ఈ సినిమాలో విలన్ గా నవదీప్ కనిపిస్తున్నాడని తెలుస్తుంది.

లేటెస్ట్ గా నవదీప్ తన సిక్స్ ప్యాక్ బాడీతో సర్ ప్రైజ్ చేశాడు. హీరోగా కొన్ని సినిమాలు చేసిన నవదీప్ ఆ తర్వాత చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు ఏకంగా నెగటివ్ రోల్ చేసేందుకు సై అన్నాడట. అల్లు అర్జున్ తో ఆర్య 2లో కలిసి నటించిన నవదీప్ త్రివిక్రం సినిమాలో విలన్ గా చేస్తున్నాడని తెలుస్తుంది. తనలోని విలనిజం చూపించేందుకు నవదీప్ చాలా కష్టపడుతున్నాడట.

ఈమధ్య హీరోలకు సమానంగా విలన్లు సిక్స్ ప్యాక్ బాడీతో ఫిట్ గా కనిపిస్తున్నారు. బన్నికి విలన్ అంటే తగినట్టుగా ఉండాలనే నవదీప్ ఇలా సిక్స్ ప్యాక్ ట్రై చేశాడని తెలుస్తుంది. మరి నవదీప్ నిజంగానే బన్ని సినిమాలో విలన్ గా నటిస్తున్నాడా లేదా అన్నది చూడాలి. అల్లు అర్జున్ ఈ సినిమా తర్వాత సుకుమార్, వేణు శ్రీరాం డైరక్షన్ లో సినిమాలు చేస్తున్నాడు.

Leave a comment