తెలంగాణకు వొచ్చిన కొండారెడ్డి బురుజు…!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం… కర్నూలు జిల్లా సెంటర్… అక్కడ నిత్యం వేలాది వాహనాలు వెళుతుంటాయి.. లక్షలాది జనం నిత్యం కలియతిరుగుతారు.. అక్కడే ఓ చారిత్రాత్మకమైన ప్రదేశం కూడా ఉంటుంది.. కర్నూల్ వెళ్ళామంటే తప్పకుండా చూడదగిన చారిత్రక ప్రదేశాల్లో అదొకటి. అదే కొండారెడ్డి బురుజు.. ఈ బురుజును అనేక సినిమాల్లో ప్రత్యక్షంగా చూసాము.. అలాంటి చారిత్రాత్మకమైన కొండారెడ్డి బురుజు తెలంగాణలో దర్శనమిస్తుంది…

అదేంటీ కర్నూల్లో ఉండాల్సిన కొండారెడ్డి బురుజు తెలంగాణకు రావడమేంటి… మీకేమైనా మతిగాని పోయిందా ఏంటీ అనుకుంటున్నారా..? అవునండి అది నిజమే… కర్నూల్లో ఉండాల్సిన కొండారెడ్డి బురుజు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పొల్కంపల్లిలో దర్శనమిస్తుంది. కాకుంటే మీరూ చూడండి.. ఇంతకు విషయం ఏంటంటే…

అదెలా సాధ్యమనుకుంటున్నారా..? ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లిలో ప్రిన్స్ మహేష్బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు షూటింగ్ కోసం ఏర్పాటు ప్రత్యేక సెట్ వేశాడు. కర్నూల్ కొండారెడ్డిబురుజు వద్ద షూటింగ్ చేయాల్సి ఉండే. కానీ సరిలేరు నీకెవ్వరూ టీం కర్నూల్కు వెళ్ళకుండా ఇక్కడే ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజును సెట్ వేశారు. సరిలేరు నీకెవ్వరూ సినిమా కోసం కొండారెడ్డి బురుజు సెట్టింగ్ తీర్చిదిద్దారు. 25 నుంచి షూటింగ్ ప్రారంభంకానుంది. సో అదన్నమాట..

Leave a comment