ఎన్టీఆర్‌, మ‌హేష్‌, చ‌ర‌ణ్ ‘ సాహో ‘ కోసం ఏం చేశారు..?

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా సినిమా అభిమానులే కాకండా… స‌గ‌టు జ‌నాలు, సెల‌బ్రిటీల్లోనూ ఎక్కడ చూసినా ఇప్పుడు సాహో గురించే చర్చ నడుస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సాహో మానియా సినీ అభిమానులను ఒక ఊపు ఊపేస్తోంది. సాహో సినిమా ఎలా ? ఉంటుందా ? అన్న ఉత్కంఠ‌కు మ‌రో 24 గంట‌ల్లో తెర‌ప‌డిపోనుంది. గురువారం అర్ధ‌రాత్రి నుంచే సాహో హంగామా స్టార్ట్ కానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం టాలీవుడ్ క్రేజీ యంగ్ హీరోస్ ఎన్టీఆర్‌, మ‌హేష్‌, రామ్‌చ‌ర‌ణ్ కూడా ప‌రోక్షంగా సాయం చేస్తున్నారు. అదెలాగంటారా ? వాళ్లంతా ఇప్ప‌టికే సాహో సూప‌ర్ హిట్ అవ్వాల‌ని యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌కు శుభాకాంక్షలు చెప్పేశారు. వీళ్ల సంగ‌తి ఇలా ఉంటే ఇప్పుడు ఈ ముగ్గురు హీరోల‌కు అసంఖ్యాకంగా ఉన్న అభిమానులు కూడా సాహోను హిట్ చేసేందుకు రెడీ అయిపోతున్నారు.

ఇండస్ట్రీలో అతి పెద్ద ఫ్యాన్ బేస్ కలిగిన మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్, మహేష్ ఫ్యాన్స్ ఇలా అందరూ సాహో విజయం ఆకాక్షించడం మెచ్చుకోదగ్గ అంశం. అటు త‌మ అభిమాన హీరోల‌తో పాటు వారి ఫ్యాన్స్ కూడా అన్నింటిని ప‌క్క‌న పెట్టేసి సాహోను హిట్ చేయాల‌ని చూస్తున్నారు. రాజ‌మౌళి చెప్పిన‌ట్టు ఏ హీరో సినిమా ఆ హీరో అభిమానులు చూస్తారు.. కానీ ప్ర‌భాస్ సినిమా మాత్రం అంద‌రు హీరోల అభిమానులు చూస్తార‌ని.. అదే ప్ర‌భాస్ గొప్ప‌త‌నం అని మెచ్చుకున్నాడు.

సాహో విజయం తెలుగు సినిమా సత్తా చాటడానికి మరో అవకాశంగా భావిస్తున్నారు. బాహుబలి విజయం గాలివాటం కాదని, ఆ స‌త్తా టాలీవుడ్‌కు ఉంద‌ని ఫ్రూవ్ చేసుకోవాలంటే అది సాహో సూప‌ర్ హిట్‌తోనే సాధ్యం కావాలి. అందుకే ఇప్పుడు అంద‌రు హీరోల‌తో పాటు హీరోల అభిమానులు కూడా సాహో హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు.

Leave a comment