అలాంటి రిలేషన్ తనకు ఇష్టం లేదంటున్న రకుల్..!

సౌత్ లో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మళ్లీ వరుస సినిమాలతో హుశారుమీద ఉంది. స్పైడర్ తర్వాత అవకాశాలు తగ్గినట్టు అనిపించగా నాగార్జునతో మన్మథుడు 2 ఆఫర్ అందుకుంది రకుల్. ఈ సినిమాలో అమ్మడి ఓ రేంజ్ లో రెచ్చిపోయిందని తెలుస్తుంది. ఇక సినిమా ప్రమోషన్స్ లో కూడా రకుల్ తన సెన్సేషనల్ కామెంట్స్ తో షాక్ ఇస్తుంది. ముఖ్యంగా పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్ షిప్ పై రకుల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ న్యూస్ గా మారాయి.

ఎప్పుడు గ్లామర్ గా కనిపించే రకుల్ పెళ్లికి ముందు రిలేషన్ షిప్ మాత్రం చేసేది లేదని అంటుంది. పెళ్లి అనేది తన దృష్టిలో చాలా గొప్పదని అందుకే పెళ్లికి ముందు తాను అసలు ఎలాంటి రిలేషన్ పెట్టుకోనని అంటుంది రకుల్. తను చేసిన సినిమాల్లో హీరోలతో క్లోజ్ గా ఉంటున్న రకుల్ పెళ్లి విషయంలో మాత్రం తగ్గేది లేదంటుంది. సో అమ్మడు ఇంత గట్టిగా ఫిక్స్ అయ్యిందంటే ప్రేమ పట్ల కూడా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదని అనుకోవచ్చు.

కోలీవుడ్ లో కూడా అరకొర అవకాశాలతో సరిపెట్టుకుంటున్న రకుల్ చూస్తుంటే అమ్మడు మళ్లీ ఫాం లోకి వచ్చినట్టే అనిపిస్తుంది. మన్మథుడు 2 హిట్టైతే మరిన్ని అవకాశాలు ఆమె ఖాతాలో వచ్చేలా ఉన్నాయి. పెళ్లికి ముందు నో రిలేషన్ అంటున్న రకుల్ ఎప్పుడూ ఇదే మాట మీద ఉంటుందా లేక ఎవరైనా నచ్చేస్తే వారితో డేటింగ్ చేస్తుందా అన్నది చూడాలి.

Leave a comment