‘ మ‌న్మ‌థుడు ‘ 2 ప్రీ – రివ్యూ

టాలీవుడ్ కింగ్ నాగార్జున లేటెస్ట్ సినిమా మ‌న్మ‌థుడు 2. నాగార్జున అన‌గానే మ‌న‌కు మ‌న్మ‌థుడు సినిమా అలా మ‌దిలో మెదిలిపోతుంది. ఎప్పుడో 2002లో కె.విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఈ సినిమాను అప్పుడు నాగార్జున స్వ‌యంగా త‌న అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌పై స్వ‌యంగా నిర్మించారు. ఈ సినిమాలో ఆడాళ్లంటే ఏ మాత్రం ప‌డ‌ని వ్య‌క్తిగా నాగార్జున న‌టించాడు. అప్ప‌ట్లో విజ‌య్‌భాస్క‌ర్ డైరెక్ష‌న్‌, త్రివిక్ర‌మ్ మాట‌లు, దేవిశ్రీ మ్యూజిక్‌, నాగార్జున‌, అన్షు, సోనాలి లాంటి హీరోయిన్లు ఉండ‌డంతో ఈ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది.

ఆ సినిమా వ‌చ్చిన 17 సంవ‌త్స‌రాల‌కు ఇప్పుడు మ‌ళ్లీ నాగ్ మ‌న్మ‌థుడు 2 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. నాగార్జున – ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టించిన ఈ సినిమాకు న‌టుడు రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మ‌న్మ‌థుడు 2. మ‌నం ఎంట‌ర్ ప్రైజెస్‌, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై నాగార్జున అక్కినేని, పి.కిర‌ణ్‌(జెమిని కిర‌ణ్‌) నిర్మిస్తున్న ఈ చిత్రం రేపు శుక్ర‌వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

నాటి మ‌న్మ‌థుడికి అమ్మాయిలంటే ప‌డ‌క‌పోతే నేటి మ‌న్మ‌థుడికి కూడా సేమ్ అమ్మాయిలంటే యూత్ వ‌య‌స్సులో ఏ మాత్రం గిట్ట‌దు. చివ‌ర‌కు పెళ్లి చేసుకోకుండానే ఏజ్ బార్ అయిపోతుంది. అప్పుడు పెళ్లి కోసం ప్రేమ‌లో ప‌డ‌డం. ఆ పాట్లు ఆ అమ్మాయి పెట్టే టార్చ‌ర్ మ‌నోడు త‌ట్టుకోలేక‌పోవ‌డం ఇలా కామెడీ, ఎమ‌ష‌న్ ట‌చ్చింగ్‌తో మ‌న్మ‌థుడు 2 సినిమా తెర‌కెక్కింది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు చూస్తుంటే నాగ్ మ‌రోసారి ఈ వ‌య‌స్సులోనూ త‌న‌లోని రొమాంటిక్ యాంగిల్ చూపించ‌బోతున్న‌ట్టు స్ప‌ష్టంగా తెలుస్తోంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రూ. 24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమాపై మంచి అంచ‌నాలే ఉన్నాయి. మ‌రో మూడు సినిమాల మ‌ధ్య‌లో రిలీజ్ అవుతోన్న నాగ్ ఆనాటి మ‌న్మ‌థుడు మ్యాజిక్ మ‌రోసారి రిపీట్ చేస్తాడా ? లేదా ? చూడాలి.

Leave a comment