సైరా బిజినెస్ రేంజ్ ఎంత.. బాహుబలిని మించేలా ప్లాన్..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సినిమా సైరా నరసింహా రెడ్డి. ఉయ్యాలవాడ నరసిం హా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో అమితాబ్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, సుదీప్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీగా వస్తున్న సైరా సినిమా బిజినెస్ లో కూడా దూసుకెళ్తుందని చెప్పొచ్చు. అక్టోబర్ 2న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఇప్పటికే కర్ణాటక రైట్స్ రూపంలో 32 కోట్లను ఖాతాలో వేసుకుంది.

ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా భారీ బిజినెస్ టార్గెట్ చేసుకుంది. పదేళ్ల తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఖైది నంబర్ 150 సినిమా 100 కోట్లు వసూళు చేసింది. ఇక భారీ అంచనాలతో వస్తున్న సైరా కచ్చితంగా 200 కోట్లు టార్గెట్ ఫిక్స్ చేశారు. కేవలం అది తెలుగులో మాత్రమే. ఇంకా ఈ సినిమాను తమిళ, హింది భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఎలా లేదన్నా 500 కోట్ల టార్గెట్ తో సైరా వసతుందని చెప్పొచ్చు.

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది. అనుష్క, తమన్నాలు కూడా స్పెషల్ రోల్స్ లో కనిపిస్తారని తెలిసిందే. చూస్తుంటే సైరా కూడా బాహుబలి రేంజ్ అందుకునేలా ఉంది. టాక్ బాగుంటే బాహుబలి తర్వాత రికార్డుల వేట కొనసాగించేది సైరానే అని చెప్పొచ్చు.

Leave a comment