Gossipsయాంకర్ అవతారం ఎత్తబోతున్న రాం చరణ్..!

యాంకర్ అవతారం ఎత్తబోతున్న రాం చరణ్..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఏంటి యాంకర్ గా మారడం ఏంటని అనుకోవచ్చు. ఇప్పటికే బిజీ షెడ్యూళ్లతో హీరోగా నిర్మాతగా ఫుల్ బిజీగా ఉన్న రాం చరణ్ ఇప్పుడు యాంకర్ గా మారడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. యాంకర్ గా అంటే షోని యాంకరింగ్ చేయడం కాదు తను చేస్తున్న సినిమాను ప్రమోట్ చేసేందుకు యాంకర్ గా మారుతున్నాడట రాం చరణ్. ఆయన నిర్మాణంలో వస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు.

ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటుగా అమితాబ్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి వంటి స్టార్స్ నటిస్తున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషనల్ బాధ్యతలను రాం చరణ్ మీద వేసుకున్నాడు. ఒక్కో స్టార్ ను తనే ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేస్తాడట. సైరాకు సంబందించిన విషయాలన్ని ఈ ఇంటర్వ్యూలో ఉంటాయని తెలుస్తుంది. చిరు చరణ్ ఒకే ఇంటర్వ్యూలో పాల్గొంటే మెగా ఫ్యాన్స్ కు అంతకన్నా ఏం కావాలి చెప్పండి.

సైరా సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదరగొడుతుంది. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనుష్క, తమన్నాలు కూడా నటిస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news