Gossipsసుకుమార్ కు బన్ని కూడా హ్యాండ్ ఇచ్చాడా..!

సుకుమార్ కు బన్ని కూడా హ్యాండ్ ఇచ్చాడా..!

టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ రంగస్థలం లాంటి సూపర్ హిట్ తర్వాత వెంటనే మరో స్టార్ ఛాన్స్ వస్తుందని భావించారు. అనుకున్నట్టుగానే సూపర్ స్టార్ మహేష్ ఆఫర్ ఇచ్చినా ఆయన అడిగిన టైం వెయిట్ చేయడం కుదరక వెంటనే అల్లు అర్జున్ తో సినిమా ఎనౌన్స్ చేశాడు సుకుమార్. ప్రస్తుతం అల్లు అర్జున్ త్రివిక్రం డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత వేణు శ్రీరాం డైరక్షన్ లో ఐకాన్ చేయాల్సి ఉంది. ఇక ఆ తర్వాత బోయపాటి శ్రీను సినిమా కూడా లైన్ లో ఉంది.

సుకుమార్ తో బన్ని సినిమా వాటికన్నా ముందే చేయాల్సి ఉన్నా లైన్ చెప్పి బౌండెడ్ స్క్రిప్ట్ ఇంకా పూర్తి చేయలేదట. అది చేయమని చెప్పి బన్ని వేరే సినిమాలకు కమిట్ అవుతున్నాడు. తీరా చూస్తే బన్ని కూడా సుకుమార్ కు హ్యాండ్ ఇచ్చే పరిస్థితి కబడుతుంది. మహేష్ అయితే అనీల్ రావిపుడి సరిలేరు నీకెవ్వరు తర్వాత సుకుమార్ తో చేయాలని అనుకున్నాడు. ఇప్పుడు బన్ని త్రివిక్రం సినిమాతో పాటుగా వేణు శ్రీరాం, బోయపాటి శ్రీను సినిమా తర్వాత సుకుమార్ కు ఛాన్స్ ఇచ్చేలా ఉన్నాడు.

మహేష్ కోసం 6 నెలలు వెయిట్ చేయలేని సుకుమార్ బన్నితో ఎనౌన్స్ మెంట్ అయితే చేయించాడు కాని అది సెట్స్ మీదకు వెళ్లాలంటే మరో ఏడాది పట్టేలా ఉంది. అప్పటిదాకా సుక్కు ఖాళీనే అని తెలుస్తుంది. మరి ఈ తొందరపాటు కాస్త తగ్గిస్తే బెటర్ అని సుకుమార్ కు సన్నిహితులు సలహా ఇస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news