సమంత తిరుమల సెంటిమెంట్.. మజిలీకి వర్క్ అవుట్ అయ్యింది మరి బేబీకి..?

అక్కినేని కోడలు సమంత సెంటిమెంట్లను అసలు మిసవ్వదు. ఓ పక్క హీరోయిన్ గా చెలరేగిపోతున్న సమంత ఫోటోషూట్స్ తో కూడా తన ఫ్యాన్స్ ను అలరిస్తుంది. మజిలీ సూపర్ హిట్ తర్వాత సమంత చేసిన సినిమా ఓ బేబీ. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే మజిలీ సినిమా రిలీజ్ కు ముందు తిరుమల స్వామి వారి దర్శనం చేసుకుంది సమంత. అది కూడా కాలినడకన మెట్ల దారి గుండా కొండ ఎక్కింది. చైతు, సమంత ఇద్దరు అప్పుడు దర్శనం చేసుకున్నారు.

అదే సెంటిమెంట్ తో ఓ బేబీ రిలీజ్ ముందు సమంత తిరుమల కొండ ఎక్కింది. సమంతతో పాటుగా తమిళ నటి, విజే రమ్య సుబ్రమణియన్ కూడా మెట్లదారి గుండా తిరుమల కొండ ఎక్కారు. సమంతతో కలిసి తిరుమల స్వామి వారిని దర్శించడం ఆనందంగా ఉందని రమ్య ట్వీట్ చేసింది. స్టార్ హీరోయిన్ అయినా కూడా సమంతకు ఉన్న ఈ సెంటిమెంట్స్, డివోషన్ చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఇక ఓ బేబీ సినిమా విషయానికి వస్తే సినిమాలో 70 ఏళ్ల బామ్మ 24 ఏళ్ల పడుచు పిల్లగా మారుతుంది. కొరియన్ మూవీ మిస్ గ్రానీ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను నందిని రెడ్డి డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్స్, బిగ్ బెన్ స్టూడియోస్, మధురా శ్రీధర్ కలిసి ఈ సినిమా నిర్మించారు.

Leave a comment