స‌మంత అక్కినేని ఫ్యామిలీ ప‌రువు తీసేస్తోందా..?

అక్కినేని కోడలు స‌మంత ఈ మ‌ధ్య కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేస్తు నెటిజ‌న్ల ట్రోలింగ్‌కు గుర‌వుతుంది. స‌హ‌జంగా స‌మంత పెళ్లికి ముందు ఎలా ఉన్నా పెళ్లికి త‌ర్వాత మాత్రం త‌న హాట్ హాట్ అందాల‌ను చూపిస్తూ ఎక్స్‌పోజ్ చేస్తూ అక్కినేని ఫ్యామిలీ ప‌రువును తీస్తోంది. ఇందంతా త‌న వ్య‌క్తిగ‌త విష‌యం అనుకుంటే పెళ్లి త‌ర్వాత ఇటు సినిమాలు చేస్తు అక్కినేని ఫ్యామిలీ ప‌రువు కాపాడాల్సింది పోయి కాంట్ర‌వ‌ర్సీ కామెంట్లు చేస్తూ నెటిజ‌న్ల ట్రోల్‌కు గుర‌వుతోంది.

అయితే స్త్రీవాదం కాస్త వుండొచ్చు కానీ సెలబ్రిటీలు మాత్రం తమ వాదాలు వినిపించే విషయంలో కాస్త జాగ్రత్త వ‌హించాలి. లేదంటే అకారణంగా, అనవసరంగా వివాదాల్లో పడి చిక్కుల్లో ప‌డాల్సి వ‌స్తుంది. తాజాగా సింగర్‌ చిన్మయి మీ టూలో తన వాయిస్‌ వినిపించి ఉనికి చాటుకునేందుకు చూస్తుంటుంది. అయితే ‘కబీర్‌ సింగ్‌’ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా తన దృష్టిలో ప్రేమంటో ఏమిటో చెప్పింది చిన్మయికి నచ్చలేదు.

సందీప్‌కి మద్దతుగా చాలా మంది సోషల్‌ మీడియాలో స‌పోర్ట్ చేశారు. కానీ చిన్మయి అతనిపై విమర్శలు చేసింది. ఇదే క్ర‌మంలో త‌నకు డబ్బింగ్‌ చెప్పే చిన్మయికి సమంత అండగా నిలిచి సందీప్‌దే తప్పంటూ విమ‌ర్శ‌లు చేసింది. దీంతో ఆమె నెటిజ‌న్ల ట్రోలింగ్‌కు గుర‌వుతున్నారు. ఇలా వారిపై.. వీరిపై విమ‌ర్శ‌లు చేస్తు భ‌ర్త నాగ‌చైత‌న్య‌తో పాటు నాగ‌ర్జున‌కు కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. ఇప్ప‌టికేనా ఈ కెలుకుడు అపితే మంచిది అని అంటున్నారు. లేకుంటే నెటిజ‌న్ల ట్రోలింగ్‌కు మ‌రింత‌గా గుర‌వ్వాల్సింది వ‌స్తుంది.

Leave a comment