ఈ అందాల విందు వెన‌క ఇంత జాలి క‌థ ఉందా…

డేగ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఉత్తరాది భామ ప్రగ్యా జైస్వాల్ ఆ తర్వాత మిర్చి లాంటి కుర్రాడు సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఆ తర్వాత క్రిష్ కంట్లో పడడంతో మెగా హీరో వరుణ్ తేజ్ కంచె సినిమాలో నటించి ఎక్కడలేని గుర్తింపు తెచ్చుకుంది. ప్రగ్య కంచె సినిమాలో అందం…. అభినయం రెండింటితోనూ ప్రేక్షకులను కట్టిపడేసింది. కంచె ట్యాగ్ వాడుకునే స్టార్ హీరోయిన్ అయిపోదామని ఎన్ని ప్రయత్నాలు చేసిన ఆమెకు కాలం కలిసి రాలేదు.

ఆ త‌ర్వాత మూడు నాలుగు అవకాశాలు వచ్చిన స్టార్ హీరోలు మాత్రం ఆమెకు ఛాన్స్ ఇవ్వలేదు. ఆ త‌ర్వాత బెల్లంకొండ జ‌య‌జాన‌కీ నాయ‌క సినిమాలో అందాలు ఆర‌బోసింది. ఆ త‌ర్వాత ఆమెను ప‌ట్టించుకునే వాడే లేక‌పోవ‌డంతో వ‌రుస పెట్టి హాట్ ఫొటో షూట్ల‌తో హోరెత్తిస్తోంది. తాజాగా బ్లూ డ్రెస్‌లో ఆమె చేసిన షూట్ చూస్తే వావ్ అనిపించకుండా ఉండదు.

అయితే ఆమె హాట్ ఫొటో షూట్లు చూసిన వారు ప్ర‌గ్య‌ను చూసి జాలి ప‌డుతున్నారు. అందం, అభిన‌యం రెండు ఉన్నా ఈ భామ‌కు అవకాశాల్లేకపోవడమేంటి అని జనాలు బాధపడిపోతున్నారు. ప్రగ్యతో పోలిస్తే అందంలో, అభినయంలో తక్కువగా ఉన్న అమ్మాయిలు చాలామంది సినిమాల్లో వెలిగిపోతున్నారు… అన్నీ ఉన్నా కూడా ఆమెకు మ‌న తెలుగు స్టార్ హీరోలు కాదు క‌దా… క‌నీసం మీడియం రేంజ్ హీరోలు కూడా ఎందుకు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని జాలి చూపిస్తున్నారు.

Leave a comment