‘ఓ బేబీ’వీకెండ్ కలెక్షన్స్.. దుమ్ములేపుతున్న సమంత..

అక్కినేని కోడ‌లు స‌మంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ‘ఓ బేబీ’ .. ఈ నెల 5వ తేదీన రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. కొరియన్ మూవీ ‘మిస్ గ్రానీ’కి రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకు తొలి ఆట నుంచే స‌క్సెస్ టాక్ వ‌చ్చింది. అదే రోజు వ‌చ్చిన సాయికుమార్ త‌న‌యుడు ఆది బుర్ర‌క‌థ అస్స‌లు అడ్ర‌స్ లేకుండా పోయింది.

ఇక ఓ బేబీలో స‌మంత న‌ట‌న‌కు ప్రేక్ష‌కులు ఫిదా అవుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవ‌ర్సీస్‌లో కూడా ఓ బేబీ దుమ్ము రేపుతోంది. టాక్ కారణంగా ఈ సినిమా వసూళ్లు పెరుగుతూ వచ్చాయి. ఫ‌స్ట్ వీకెండ్‌లో మంచి వ‌సూల్లు కొల్ల‌గొట్టిన ఈ సినిమా మూడు రోజుల‌కు వ‌ర‌ల్డ్‌వైడ్‌గా రూ. 17 కోట్ల గ్రాస్ రాబట్టింది.

12
ఇక ఓవ‌ర్సీస్లో ఇప్ప‌టికే హాఫ్ మిలియ‌న్ డాల‌ర్ల మార్క్‌ను క్రాస్ చేసిన ఓ బేబీ… తొలి వారం ముగిసే స‌రికే 1 మిలియ‌న్ డాల‌ర్ల‌ను దాటేస్తుంద‌ని అంటున్నారు. ఓ లేడీ ఓరియంటెడ్ రోల్‌లో సమంత న‌టించిన ఈ సినిమా అక్క‌డ మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేయ‌డం అంటే గొప్ప రికార్డ్ అని ట్రేడ్ వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి.

ఇప్ప‌ట్లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చే పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ఈ వారాంతం వరకూ ఈ సినిమా వసూళ్ల జోరు కంటిన్యూ చేయ‌నుంది. రంగ‌స్థ‌లం, మ‌జిలీ సినిమాల త‌ర్వాత స‌మంత‌కు ఓ బేబీ సినిమాతో మ‌రో సూప‌ర్‌హిట్ ఖాతాలో ప‌డ‌డంతో ఆమె ఆనందానికి అవ‌ధులు లేవు.

11

Leave a comment