సందీప్ వంగాపై అనసూయ షాకింగ్ కామెంట్స్!

తెలుగు బుల్లితెరపై ‘జబర్ధస్త్’కామెడీ షో తో బాగా పాపులారిటీ తెచ్చుకున్న యాంకర్ అనసూయ ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఇప్పుడు మరోసారి వార్తల్లోకి ఎక్కింది అనసూయ. ఆ మద్య విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగా తీసిన ‘అర్జున్ రెడ్డి’ఓ ట్రెంట్ సృష్టించింది. ఇదే మూవీ హిందీలో సందీప్ వంగ దర్శకత్వంలో ‘కబీర్ సింగ్’ గా తీశారు.

అయితే ఈ రెండు మూవీస్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముద్దు సన్నివేశాలు ఇబ్బందికరంగా ఉన్నాయని, ప్రేమించిన వ్యక్తిపై చేయి చేసుకోవడం ఏంటని ఎంతో మంది మహిళలు, సామాజిక కార్యకర్తలు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా సమాధానం ఇస్తూ..ప్రేమికుల మధ్య ఒకరి చెంపపై ఒకరి కొట్టుకునేంత స్వేచ్ఛలేకపోతే వారి మధ్య ప్రేమ ఉంటుందని అన్నారు.

అంతే దీనిపై ఒక్కసారే విమర్శల జల్లులు వెల్లువెత్తాయి. అక్కినేని సమంత ఈ విషయంపై విభేదించారు..తర్వాత సింగర్ చిన్మయి సైతం విమర్శించింది. ఒక వ్యక్తి మనల్ని గాఢంగా ప్రేమిస్తే అతను ఎట్టిపరిస్థితుల్లో మనపై చేయి ఎత్తడని చిన్మయి అన్నారు. మన అనుమతిలేకుండా మనల్ని తాకడని, ఇలా కొట్టడం ప్రేమకు చిహ్నమా అని ప్రశ్నించారు. తాజాగా సందీప్ వంగా వ్యాఖ్యలను తానెప్పుడో ఖండించానని అనసూయ ట్వీట్ చేశారు. అయితే చిన్మయి మహిళల పట్ల మొదట్లో చేసిన వ్యాఖ్యలను నేను ఖండించినప్పుడు నువ్వు నా వెనుక నిలబడలేదు. కానీ ఇప్పుడు మాత్రం నీ స్పందన చూసి నేను బలపడ్డానని అనుకుంటున్నానని అనసూయ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

Leave a comment