అఖిల్ ప్రేయ‌సిపై కొత్త రూమ‌ర్‌…!

అక్కినేని నవమన్మధుడు అఖిల్‌ ఒక్క హిట్ అంటూ చేయని ప్రయత్నం లేదు. తొలి సినిమా అఖిల్… రెండో సినిమా హలో…. తాజాగా మిస్టర్ మజ్ను.. ముగ్గురు దర్శకులతో మూడు సినిమాలు చేసినా మూడు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నాగార్జున అఖిల్ కెరీర్ కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న మనోడికి మాత్రం కాలం కలిసి రావడం లేదు. ఇదిలా ఉంటే గీతా బ్యానర్లో అఖిల్ ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఎప్పుడో ప్రారంభోత్సవం జరుపుకుంది. సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అయితే అఖిల్ సరసన సరైన హీరోయిన్ లేక‌పోక‌పోవ‌డంతో ఇంకా సినిమా షూటింగ్ పట్టాలెక్కలేదు. ఈ సినిమాలో అఖిల్ సరసన.. ప్రేయ‌సిగా న‌టించేందుకు ముందుగా కైరా అద్వానీని అనుకున్నారు. ఆ తర్వాత రష్మిక మందన్న పేరు వినిపించింది.

వీళ్ళిద్దరూ రేటు ఎక్కువ చెప్పడంతో ఇప్పుడు తమిళ భామ నివేదా పేతురాజ్ ను ఎంపిక చేసినట్టు అనిపిస్తుంది. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో గీతా సంస్థ చెప్తే కానీ తెలియదు. ఏదేమైనా హీరోయిన్ లేక‌ అఖిల్ సినిమా రెండు నెలలుగా సెట్స్ మీదకు వెళ్లకుండా ఉంది. ఇక అఖిల్ హీరోయిన్ పై రోజుకో రూమ‌ర్ వినిపిస్తోంది. తొలి హిట్ కోసం పరితపించి పోతున్న అఖిల్ కు వరస ప్లాపుల్లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ హిట్‌ ఇస్తాడా? లేదా? అన్నది చూడాలి. గీతా సంస్థ నిర్మించే సినిమాకు దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ ఇస్తారు.

Leave a comment