టాలీవుడ్ ను ఏలేస్తున్న కుర్ర దర్శకులు..!

తెలుగు పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతుంది. ఒకప్పుడు ఒకే ఫార్మెట్ లో వచ్చే తెలుగు సినిమాలు దశ దిశ మార్చేశాయి. స్టార్ డైరక్టర్, స్టార్ హీరో కాంబినేషన్ అనే కాదు నూతన దర్శకులు కొత్త వాళ్లతో కూడా సత్తా చాటుతున్నారు. ఈమధ్య రిలీజైన సినిమాలను చూస్తే స్వరూప్, వివేక్ ఆత్రేయా ఇలా న్యూ టాలెంటెడ్ డైరక్టర్స్ టాలీవుడ్ కు మంచి పోత్సాహాన్ని ఇస్తున్నారు.

వివేక్ ఆత్రేయా మంటల్ మదిలో సినిమా తీశాడు. అదే స్టార్ కాస్ట్ తో బ్రోచేవారెవరురా సినిమా వచ్చింది. ఫన్, క్రైం, కామెడీ జానర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను మంచి అనుభూతికి గురి చేసింది. ఈ సినిమా తర్వాత వివేక్ ఆత్రేయ టాప్ లీగ్ లోకి వెళ్లాడని తెలుస్తుంది. తన తర్వాత సినిమా మైత్రి మూవీ మేకర్స్ లో ఉంటుందని టాక్. ఇక ఈమధ్య వచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది.

నవీన్ పొలిశెట్టి హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా దర్శకుడు స్వరూప్ కు అశ్వనిదత్ బ్యానర్ లో స్వప్న, ప్రియాంకా దత్ లతో సినిమా ఛాన్స్ వచ్చిందని తెలుస్తుంది. నీ దగ్గర టాలెంట్ ఉంటే అవకాశాలు వాటంతట అవే వస్తాయని ఈ దర్శకులను చూస్తే మరోసారి ప్రూవ్ అవుతుంది. వివేక్, స్వరూప్ లాంటి ఎంతో ప్రతిభ గల వారు తెలుగు పరిశ్రమకు ఎంతో అవసరం అని చెప్పొచ్చు.

Leave a comment