మ‌న్మ‌థుడు 2 ట్రైల‌ర్‌: కృష్ణావ‌తారం కంప్లీట్‌…. రామావ‌తారం స్టార్ట్‌..

మ‌న్మ‌థుడు అంటేనే అమ్మాయిల‌ను బుట్ట‌లో వేసుకునేవాడు అన్న అర్థం ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక నాగార్జున మ‌న్మ‌థుడు సినిమా తీసిన‌ప్ప‌టి నుంచి మ‌నోడికి మాంచి రొమాంటిక్ ఇమేజ్ వ‌చ్చేసింది. ఎప్పుడో 2002లో వ‌చ్చిన ఆ సినిమా అప్ప‌ట్లో యూత్‌లో నాగ్‌కు తిరుగులేని ఇమేజ్ తెచ్చింది. ఆ సినిమా వ‌చ్చి 17 ఏళ్లు అవుతున్నా ఇప్ప‌ట‌కీ చూస్తుంటే ఫ్రెష్‌గా ఉన్న ఫీలింగే ఉంటుంది.

మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు మ‌న్మ‌థుడు 2 తెర‌మీద‌కు వ‌స్తోంది. ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ – వ‌యాకామ్ బ్యాన‌ర్లు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాలో నాగ్ – ర‌కుల్‌ప్రీత్‌సింగ్ జంట‌గా న‌టిస్తున్నారు. రాహుల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే అన్ని కార్య‌క్ర‌మాలు కంప్లీట్ చేసుకున్న మ‌న్మ‌థుడు 2 ఆగ‌స్టు 9న ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది.

ఇప్ప‌టికే రిలీజ్ అయిన టీజ‌ర్లు, ట్రైల‌ర్లు సినిమాపై మ‌రింత హైప్ క్రియేట్ చేశాయి. బిజినెస్ కూడా దుమ్మురేపుతోంది. తాజాగా రిలీజ్ అయిన థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ చూస్తే ఫ‌స్టాఫ్‌లో అమ్మాయిల‌కు దూరంగా ఉండే నాగ్ ఆ త‌ర్వాత అమ్మాయిలతో ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తూ… ప‌దే ప‌దే గ‌ర్ల్‌ఫ్రెండ్స్‌ను మార్చేస్తుంటాడు.

చివ‌ర‌కు పెళ్లి వ‌య‌స్సు దాటిపోతుంది.. అప్పుడు ర‌కుల్‌ప్రీత్‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడ‌ని తెలుస్తోంది. చివ‌ర‌కు పెళ్లి త‌ర్వాత కృష్ణావ‌తారం కంప్లీట్ అయ్యి రామావ‌తారంలోకి ఎంట్రీ ఇవ్వాల్సి వ‌స్తుంది. ఆ టైంలో త‌న‌కు పిల్ల‌లు వ‌ద్ద‌ని మ‌ళ్లీ గోల పెడ‌తాడు. చివ‌ర‌కు కుటుంబంలో అనుబంధాలు క‌ల‌గ‌లిపి సినిమాను ముగించిన‌ట్టే ట్రైల‌ర్ చెపుతోంది. ఏదేమైనా ట్రైల‌ర్‌ను బ‌ట్టి చూస్తే కామెడీ, రొమాన్స్‌, ఎమోష‌న్ గ‌ట్టిగా ఉన్నాయి.

Leave a comment