ఇస్మార్ట్‌కు కామ్రేడ్ దెబ్బ ప‌డిందిగా..

యంగ్ ఎనర్జిటిక్ హీరో రామ్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన శంకర్ సినిమా అనూహ్యంగా అందరి అంచనాలు తారుమారు చేస్తూ నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని లాభాల బాట పట్టేసింది. వారం రోజులపాటు బాక్సాఫీస్ దగ్గర శంకర్ హంగామా మామూలుగా లేదు. ఇక ఈ వారం థియేటర్లలోకి దిగుతోన్న‌ విజయ్ దేవరకొండ డియ‌ర్ కామ్రేడ్ సినిమా శంకర్ జోరుకు బ్రేకులు వేసినట్లే కనిపిస్తోంది.

ఇప్పటికే మల్టీప్లెక్స్ లలో కామ్రేడ్ అడ్వాన్స్ బుకింగ్ లు చాలా స్పీడ్ గా ఉన్నాయి. అదే టైంలో మల్టీప్లెక్స్ లలో శంకర్ 40 నుంచి 50 శాతం డ్రాప్ అయ్యింది. అయితే బి, సి సెంటర్లలో మాత్రం కలెక్షన్లు స్టడీగా ఉండటం కలిసిరానుంది. లేకపోవడంతో ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక శంకర్ రూ. 40 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందా ? లేదా అన్నది కామ్రేడ్‌కు వచ్చే టాక్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది.

ఇక కామ్రేడ్‌పై హైప్ మామూలుగా లేదు. యూత్ ని స్పెషల్ గా టార్గెట్ చేసుకున్న మూవీ కాబట్టి క్రేజ్ ఇంకోలా ఉంది. అయితే మాస్ కి కూడా కామ్రేడ్ క‌నెక్ట్ అయితే ఇస్మార్ట్‌కు గ‌ట్టి దెబ్బే ప‌డుతుంది. ఏదేమైనా ఇస్మార్ట్‌పై కామ్రేడ్ ఎఫెక్ట్ ఎంత అనేది ? మ‌రో 24 గంట‌ల్లో తేలిపోనుంది. ఇప్పటికే అరవై కోట్ల గ్రాస్ టచ్ చేసిన శంకర్ ఇప్పుడు జోరు కొంత తగ్గింది… అయితే లాంగ్ బాక్సాఫీస్ ర‌న్ ఎలా ఉంటుందో ? చూడాలి.

Leave a comment