ఇస్మార్ట్ శంకర్.. మరో ఊర మాస్ ట్రైలర్..!

పూరి జగన్నాథ్, రామ్ కాంబినేషన్ లో వస్తున్న క్రేజీ మూవీ ఇస్మార్ట్ శంకర్. ఛార్మి, పూరి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ నెల 18న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. పోకిరి 2గా ప్రమోట్ అవుతున్న ఇస్మార్ట్ శంకర్ సినిమా నుండి మరో మస్త్ జబరస్త్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ లో మరోసారి పూరి తన మార్క్ చూపించాడు.

సినిమా కాన్సెప్ట్ ఎక్కువగా రివీల్ చేయకుండా హీరోయిన్స్ అందాలు, హీరో రఫ్ క్యారక్టరైజేషన్ తోనే ఈ సెకండ్ ట్రైలర్ కూడా వచ్చింది. అయితే ఫస్ట్ ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ ఇస్మార్ట్ గా ఉందని మాత్రం చెప్పొచ్చు. పూరి సినిమా అంటే ఇలానే ఉంటాయ్ అన్నట్టుగా మళ్లీ తన పాత పద్ధతి ఫాలో అయిన పూరి ఇస్మార్ట్ శంకర్ తో ఇస్మార్ట్ హిట్ కొట్టేలా ఉన్నాడు.

మణిశర్మ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. హీరోయిన్స్ నిధి, నభా ఇద్దరు ఒకరిని మించి ఒకరు అందాలను గుమ్మరించేశారు. నిధి ఇంతకుముందు చేసిన ఏ సినిమాలో ఇలా రెచ్చిపోలేదు. నభా నటేష్ రెండో సినిమానే ఇలా కుమ్మేయడం షాకింగ్ గా ఉంది. రామ్ కూడా జగడం తర్వాత పూర్తిస్థాయి మాస్ క్యారక్టర్ లో నటిస్తున్నాడు. రిలీజ్ ముందు ఇంత హంగామా చేస్తున్న ఇస్మార్ట్ శంకర్ రిలీజ్ తర్వాత సందడి ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment