Gossipsబిగ్ బాస్ -3లో మెగా హీరోయిన్ ఫిక్స్‌..

బిగ్ బాస్ -3లో మెగా హీరోయిన్ ఫిక్స్‌..

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్‌కు ప్రేక్ష‌కుల్లో ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. తెలుగులో ఇప్ప‌టికే విజ‌య‌వంతంగా రెండు సీజ‌న్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడో సీజ‌న్‌కు రెడీ అవుతోంది. తొలి రెండు సీజ‌న్ల‌కు యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, నేచుర‌ల్ స్టార్ నాని హోస్టులుగా ఉన్నారు. ఇప్పుడు మూడో సీజ‌న్‌కు టాలీవుడ్ మ‌న్మ‌థుడు నాగార్జున హోస్ట్‌గా ఉన్నారు. దీనిపై తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో ఆయ‌న క‌న్‌పార్మ్ చేసేశారు.

ఇక హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్లుగా ఎవ‌రెవ‌రు ? ఉండ‌బోతున్నారు ? అనే దానిపై చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కొందరి పేర్లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. లాస్య, గుత్తా జ్వాలా, నందు, హేమచంద్ర, శ్రీముఖి లాంటి సెలబ్రిటీల పేర్లు వినిపించాయి. వీరిలో ఎవ్వ‌రూ క‌న్‌ఫార్మ్ అయిన‌ట్టు చెప్ప‌లేదు. ఒక్క శ్రీముఖి మాత్రం షోలో ఉన్న‌ట్టు కొంత క్లారిటీ వ‌చ్చింది.

ఇప్పుడు ఈ లిస్ట్ లో మరోపేరు వినిపిస్తోంది. మెగా హీరో వ‌రుణ్‌తేజ్ సూప‌ర్ హిట్ సినిమా ఫిదాలో న‌టించిన గాయ‌త్రీ గుప్తా బిగ్ బాస్‌-3 హౌస్‌లోకి వెళ్లేందుకు సైన్ చేసింద‌ని స‌మాచారం. ఫిదాలో సాయిప‌ల్ల‌వి ఫ్రెండ్ పాత్ర‌లో న‌టించిన గాయ‌త్రి గుప్తా ఆ త‌ర్వాత కాంట్ర‌వ‌ర్సీ కామెంట్ల‌తో వార్త‌ల్లో కెక్కింది.

గాయ‌త్రి బిగ్ బాస్ హౌస్‌లో ఉంటే మ‌రింత మ‌సాలా యాడ్ అవుతుంద‌నే కంటెస్టెంట్లు ఆమెను తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. ఈమె పలు సీరియళ్లు, సినిమాలలో కూడా నటించింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news