ఆ సీన్ షూటింగ్‌లో అమ‌ల టెన్ష‌న్‌… కార‌ణం ఇదే..

మాజీ భర్త విజయ్ నుంచి విడాకులు తీసుకున్నాక నటి అమలాపాల్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతుంది. అమల ప్రధాన పాత్రలో రత్న కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆడై సినిమా.. తెలుగులో ఇది ఆమె పేరుతో రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ కు ముందే టీజర్… ట్రైలర్ చూసిన పలువురు ఈ సినిమాపై చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అమలాపాల్ నగ్నంగా నటించే సీన్ల విషయంలో మిక్స్ డ్ టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లలో అమల న్యూడ్‌గా నటించే సీన్లలో తాను నటించే టప్పుడు ఎదుర్కొన్న పరిస్థితులను వివరించింది.

తాను న‌టిగా కంటిన్యూ కావాలా ? అనే డైల‌మాలో ఉన్న‌ప్పుడు… సినిమాల‌కు పూర్తిగా గుడ్ బై చెప్పాల‌నుకున్న‌ప్పుడు త‌న‌కు ఆడై (ఆమె) ఆఫ‌ర్ వ‌చ్చింద‌ని.. అప్ప‌టికే చాలా క‌థ‌లు విన్నా… అవి త‌న‌కు న‌చ్చ‌లేద‌ని… అందుకే ఈ సినిమా న‌చ్చి ఓకే చెప్పిన‌ట్టు తెలిపింది. ఈ సినిమా ద‌ర్శ‌కుడు ర‌త్న‌క‌మార్ త‌న‌కు క‌థ చెప్పిన‌ప్పుడే న్యూడ్ సీన్ ఉంటుంద‌ని… అందుకు ఓ స్పెషల్ క్యాస్ట్యూమ్ ను ప్రిపేర్ చేస్తామని చెప్పాడ‌ట‌.

చివ‌ర‌కు న్యూడ్ సీన్ తీసే రోజున అమ‌ల విపీర‌త‌మైన టెన్ష‌న్‌కు గురైంద‌ట‌. ఇక సెట్లో ఈ సీన్ తీసేప్పుడు కేవలం 15మంది ఉండేలా చూసుకున్నాను.. నేను వారిని నమ్మాన‌ని… అందుకే ఆ సీన్‌లో టెన్ష‌న్ ప‌డ్డా… భ‌య‌ప‌డ‌కుండా న‌టించాన‌ని చెప్పింది. ఏదేమైనా ఆమె టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌తోనే ఎన్నో సంచ‌ల‌నాల‌కు కార‌ణ‌మైంది. ఈ న్యూడ్ సీన్‌తోనే సినిమాపై ఎక్క‌డా లేని అంచ‌నాలు వ‌చ్చేశాయి. మ‌రి రిలీజ్ అయ్యాక ఆడై (ఆమె) ఇంకెన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేస్తుందో ? చూడాలి.

Leave a comment