అఖిల్‌కు గీతాతో చెడిందా…చుక్క‌లు చూపించేస్తున్నారు…

అక్కినేని హీరో అఖిల్ కొత్త సినిమా వ్యవహారం వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. సినిమా ప్రారంభోత్సవం చేసి హడావుడి చేసినా అక్కడనుంచి సెంటీమీటర్ కూడా ఈ సినిమా ముందుకు కదల్లేదు. సినిమా విషయంలో నిర్మాత బ‌న్నీ వాస్ ప్ర‌తిదానికి గీచి గీచి బేరాలు ఆడుతున్న‌ట్టు టాక్‌. దీంతో అఖిల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు సినిమాకు కమిట్ అయ్యాడు… బయటకురాను లేడు.. అలా అని అక్కడ జరుగుతున్న ఆలస్యాన్ని ఎవరితో చెప్పుకోను లేడు దీంతో అఖిల్ గీతా సంస్థ తీరుపై రగిలిపోతున్నట్లు ఇండస్ట్రీలో గుస‌గుస‌లు నడుస్తున్నాయి.

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఇప్పటి వరకు హీరోయిన్ సెట్ చేయలేదు. రష్మిక అయితే బాగుంటుందని అఖిల్ చెబుతున్నా రేటు ఎక్కువ కావడంతో గీతా సంస్థ ఒప్పుకోవడం లేదట. ఒక్క హీరోయిన్ విషయంలోనే కాదు… సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ప్రతి టెక్నీషియన్ విషయంలోనూ గీత వాళ్ల‌ లెక్కలు వేరుగా ఉంటాయి అన్నది తెలిసిందే. ఓ వైపు దర్శకుడు భాస్కర్ కు నిర్మాత బన్నీ వాసుకు కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదట.

మరో మేటర్ ఏంటంటే ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో గీతా సంస్థ సాయిధరమ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేస్తోంది. ఆ సినిమాపై బాగా కాన్సన్ట్రేషన్ చేసి అఖిల్ సినిమాను పెద్దగా పట్టించుకోవడం లేదట. ఈ లెక్కన చూస్తే అఖిల్ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో ? అసలు ఈ ఏడాది విడుదల అవుతుందా అన్న దానిపై క్లారిటీ లేదు. పాపం మూడు ప్లాపుల్లో ఉన్న అఖిల్ గీతా సంస్థ‌పై ఆశలు పెట్టుకుని ఈ సినిమా ఒప్పుకుంటే మ‌నోడికి అప్పుడే చుక్క‌లు క‌న‌ప‌డుతున్నాయి.

Leave a comment