రాజ‌మౌళిపై తార‌క్‌, చెర్రీ ఫ్యాన్స్ ఫైర్‌.. రీజ‌న్ ఇదే..

బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ ఆర్‌ ఆర్. బాహుబలి తర్వాత రాజమౌళి ఎలాంటి కథతో సినిమా తెరకెక్కిస్తాడు ? ఎవ‌రు హీరోలుగా ఉంటారు ? అన్న ఉత్కంఠ దేశవ్యాప్తంగా ఉంది. ఎవరి అంచనాలకు అందని విధంగా టాలీవుడ్ యంగ్ హీరోల్లో స్టార్ హీరో లాగా ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్… మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ సెట్ చేయడంతోనే రాజమౌళి సగం హిట్ కొట్టేశాడు. వీరి కాంబినేషన్లో హిస్టారికల్ నేపథ్యంలో దాదాపు రూ. 300 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా వ‌చ్చే యేడాది జూలై 30న రిలీజ్ చేస్తున్న‌ట్టు ఎనౌన్స్ చేశారు.

అయితే ఇప్పుడు రిలీజ్ డేట్‌కు త‌గినట్టుగా షూటింగ్ జ‌ర‌గ‌క‌పోవ‌డంతో అటు తార‌క్ ఫ్యాన్స్‌తో పాటు ఇటు చెర్రీ అభిమానులు… ఈ సినిమా కోసం వెయిట్ చేస్తోన్న వారంద‌రూ రాజ‌మౌళిపై కాస్త ఆగ్ర‌హంతోనే ఉన్నారు. గ‌తంలో కూడా రాజ‌మౌళి బాహుబ‌లి సీరిస్ రెండు సినిమాల‌ను ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్ల‌కు రిలీజ్ చేయ‌లేదు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విష‌యంలోనూ అదే జ‌రుగుతుంద‌న్న‌ది చాలా మందికి క్లారిటీ వ‌చ్చేసింది.

షూటింగ్ విష‌యంలో సీన్ల‌ను చెక్కీ చెక్కీ కాని రాజ‌మౌళి తీయ‌డ‌న్న పేరుంది. దీనికి తోడు తార‌క్‌, చెర్రీల‌కు గాయాల‌వ్వ‌డం, తార‌క్ హీరోయిన్ సెట్ కాక‌పోవ‌డం లాంటి కార‌ణాల‌తో ఆర్ ఆర్ ఆర్ అనుకున్న డేట్ కంటే చాలా లేట్ అయ్యేలా ఉంది. ప్ర‌స్తుతం రాజ‌మౌళీ అమెరికాలో ఉన్నారు. ప్రస్తుతం దొరికిన గ్యాప్ లో రామ్ చరణ్ పూర్తిగా సైరా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ బిజీ గా ఉన్నాడు. ఎన్టీఆర్ మాత్రం ఈ వారం రోజులు తన ఫ్యామిలీతో జాలిగా గడుపుతున్నట్లు తెలుస్తుంది.

Leave a comment