భార్య దూర‌మై డిఫ్రెష‌న్‌లో టాలీవుడ్ స్టార్..

టాలీవుడ్ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోన్న పుకార్ల‌లో ఇప్పుడు ఈ పుకారు గురించే ఎక్క‌డ చూసినా ఒక్క‌టే చ‌ర్చ న‌డుస్తోంది. ఇండ‌స్ట్రీలో అత‌డో టాలెంటెడ్ యాక్ట‌ర్‌. వాళ్ల‌ది బ‌ల‌మైన సినిమా బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ. నాన్న‌, అక్క‌, సోద‌రుడు అంద‌రూ సినిమా వాళ్లే. పెద్ద పేరున్న సినిమాలు వాళ్ల సొంతం. మ‌నోడు కూడా కొత్త ర‌కం క‌థ‌ల‌తో సినిమాలు చేస్తుంటాడ‌న్న పేరుంది.

అయితే స‌ర‌దు హీరోకు కొద్ది రోజులుగా స‌రైన స‌క్సెస్ లేదు. బాగా క‌ష్ట‌ప‌డ‌తాడ‌న్న పేరున్నా ఎందుకో సినిమాల్లో కాలం క‌లిసి రాలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు అత‌డి వైవాహిక జీవితం కూడా ట్ర‌బుల్స్‌లో ప‌డిన‌ట్టు తెలుస్తోంది. ఇష్టపడి పెళ్లాడిన భార్య అతడిని విడిచిపోయిందట. త‌న ఫ్యామిలీలో తెలిసి వాళ్ల‌కు ప‌రిచ‌యం ఉన్న అమ్మాయి కావ‌డంతో మ‌న‌సు ప‌డి ఆమెను పెళ్లాడాడు.

ఇప్పుడు వాళ్లిద్ద‌రి మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల నేప‌థ్యంలో దూరంగా ఉంటున్న‌ట్టు ఇండ‌స్ట్రీలో పుకార్లు, షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆ యువ హీరో మరింతగా డిప్రెషన్‌కి గురయ్యాడని, కొత్త సినిమాలపై ఏ మాత్రం కాన్‌సంట్రేష‌న్ చేయ‌కుండా… మ‌ద్యం, డ్ర‌గ్స్‌కు అల‌వాటు ప‌డిపోయాడ‌ట‌. చివ‌ర‌కు ఆ హీరో తండ్రి అయిన సీనియ‌ర్ కొడుకును అమెరికా పంపినా అక్క‌డ కూడా మార‌లేద‌ని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అత‌డి గురించే అత‌డి కుటుంబ స‌భ్యులు తీవ్ర ఆందోళ‌న చెందుతున్న‌ట్టు తెలుస్తోంది.

Leave a comment