న్యూడ్ సీన్స్ తోనే సినిమా ప్రమోషన్స్..!

ఓ సినిమా సక్సెస్ అవడానికి ప్రమోషన్స్ చాలా ఉపయోగపడతాయి. సినిమాను జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో చేసే ప్రమోషన్స్ సినిమా మీద ఓ అభిప్రాయాన్ని కలిగిస్తాయి. ప్రమోషన్స్ చేస్తూ ఉంటే ప్రేక్షకులకు కూడా సినిమా మీద ఓ ఆసక్తి కలుగుతుంది. అయితే ఈ ప్రమోషన్స్ ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. సినిమాలో హాట్ సీన్స్ తోనే ప్రమోషన్స్ కట్ చేస్తున్నారు. స్టార్ సినిమాలకు ఈ పోకడ లేదు కాని చిన్న బడ్జెట్ సినిమాలు.. అడల్ట్ సినిమాలకు ఈ రకమైన ప్రమోషన్స్ చేస్తున్నారు.

లేటెస్ట్ గా తమిళంలో ఓ సినిమాకు ఇలానే న్యూడ్ సీన్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అమలా పాల్ లీడ్ రోల్ లో రత్న కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా ఆడై. తెలుగులో ఆమె పేరుతో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమా టీజర్ లో న్యూడ్ సీన్ లో అమలా పాల్ ఆశ్చర్యపరచింది. అనుకున్నట్టుగానే ఆ సీన్ కు ఎక్కువ ప్రశంసలు రాగానే ఇక దాని మీద రోజు చర్చలు చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో అమలా పాల్ న్యూడ్ సీన్స్ ఒక ఐటం గా మారింది.

ఇది ఓ రకంగా సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. కాని అసలు కంటెంట్ చెప్పకుండా కేవలం అమలా పాల్ న్యూడ్ సీన్స్ మీదే వార్తలు రావడం చిత్రయూనిట్ కు షాక్ ఇస్తుంది. ఆ సీన్ లో అమలా పాల్ ఒంటి మీద నూలుపోగు లేకుండా నటించింది. ఆమె ఎలా చేసింది.. ఏం చేసింది.. సెట్ లో అప్పుడు ఎంతమంది ఉన్నారు. అమలా న్యూడ్ గా ఎలా కవర్ చేసింది ఈ ప్రశ్నలు వస్తున్నాయి. అయితే తనని అలా కూర్చోమని చెప్పారు కాని నేనే సహజంగా ఉంటుందని న్యూడ్ గా నటించానని అమలా పాల్ చెప్పడం కొసమెరుపు. మరి ఇంత హంగామా చేస్తున్న ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Leave a comment