‘ డియ‌ర్ కామ్రేడ్ ‘ ఆశలు ట్రైల‌ర్‌తోనే కరిగిపోయాయ..?

విజ‌య్ దేవ‌ర‌కొండ – ర‌ష్మిక మంద‌న్న కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన డియ‌ర్ కామ్రేడ్ సినిమాపై విజ‌య్ అభిమానుల‌తో పాటు సామాన్య ప్రేక్ష‌కుల్లో ఎన్నో అంచ‌నాలు ఉన్నాయి. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ట్రైల‌ర్ 3 నిమిషాల‌కు పైగా ఉంది. ఓవ‌రాల్‌గా ట్రైల‌ర్ రొటీన్‌గానే ఉంద‌న్న టాక్ వ‌చ్చేసింది. రొటీన్ కాలేజ్ ల‌వ్‌స్టోరీ… స్టూడెంట్స్ పాలిటిక్స్‌… ప్రేమ‌లు.. పాలిటిక్స్ నేప‌థ్యంలో విడిపోవ‌డాలు..అపార్థాలు… అన‌ర్థాల త‌ర‌హా క‌థ‌తోనే డియ‌ర్ కామ్రేడ్ సినిమా లైన్ ఉండ‌బోతోంద‌న్న క్లారిటీ అయితే వ‌చ్చేసింది.

ఇక హీరో బాబి (విజ‌య్‌)కు హీరోయిన్ లిల్లి (ర‌ష్మిక‌)కు మ‌ధ్య చిన్న‌ప్ప‌టి నుంచే ప్రేమాయ‌ణం న‌డుస్తుంటుంది. ఆ త‌ర్వాత వీరిద్ద‌రి ప‌రిచ‌యాలు, ప్రేమ‌లు విడిపోవ‌డాలు… చివ‌ర‌కు క‌ల‌సుకోవ‌డం జ‌రుగుతుంద‌ని ట్రైల‌ర్‌లోనే చెప్పేశారు. ట్రైల‌ర్ మ‌రీ అంత ఆస‌క్తిగా అయితే లేదు. డియ‌ర్ కామ్రేడ్‌తో విజ‌య్ ఖ‌చ్చితంగా హిట్ కొడ‌తాడ‌ని… ట్రైల‌ర్ దుమ్మురేపుతుంద‌ని ఆశ‌లు పెట్టుకున్న అంద‌రికి ట్రైల‌ర్ అయితే నిరుత్సాహ ప‌రిచింది.

మైత్రీ మూవీస్ సంస్థ తెర‌కెక్కిస్తోన్న ఈ సినిమాకు కొత్త ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇక సినిమా క‌థ కొత్త‌గా లేద‌ని తేలిపోవ‌డంతో ఇప్పుడు ఆశ‌ల‌న్నీ ద‌ర్శ‌కుడు భ‌ర‌త్ టేకింగ్‌పైనే ఉన్నాయి. ఇక విజ‌య్ – ర‌ష్మిక కాంబోలో గ‌తంలో గీత‌గోవిందం లాంటి హిట్ సినిమా ఉండ‌డంతో ఇప్పుడు ఈ క్రేజీ కాంబినేష‌న్‌లో సినిమా కోసం మ‌రోసారి వెయిటింగ్‌లో ఉన్నవారు కూడా కామ్రేడ్‌పై ఆశ‌ల‌తో ఉన్నారు. మ‌రి ట్రైల‌ర్‌తో నిరుత్సాహ ప‌రిచిన విజ‌య్ ఏం చేస్తాడో ? చూడాలి.

Leave a comment