నువ్వు హిట్ కొడితే ఛాన్స్ ఇస్తా…. బాల‌య్య బంప‌ర్ ఆఫ‌ర్‌..

తాజాగా రాబోతున్న `ఇస్మార్ట్ శంక‌ర్‌` సినిమాపై చాలా మంది భ‌విష్య‌త్తులే ఆధార‌ప‌డి ఉన్నాయి. ఈ సినిమా పూరీ జ‌గ‌న్నాధ్‌- రామ్ కాంబోలో రాబోతుంది. ఫ్లాపుల‌తో వ‌స్తున్న హీరో రామ్‌కు, పూరీకి కూడా ఈ సినిమా లైఫ్ అండ్ డెత్‌గా మారింది. ఊరమాస్ రామ్ అవతారం గురించి మిక్స్డ్ రెస్పాన్స్ ఉన్నా అభిమానుల్లో ఔట్ పుట్ అదిరిపోయింద‌న్న మాట వినిపిస్తోంది. ప్రీ రిలీజ్‌కు ముందు ఏ సినిమాపై అయినా ఈ మాత్రం న‌మ్మ‌కంతోనే ఉంటారు. కాక‌పోతే.. ఏడు వ‌రుస ఫ్లాపుల‌తో వ‌స్తున్న పూరీ ఈ సినిమాపై భారీ ఆశ‌లు పెట్టుకోవ‌డం వెనుక మ‌రో కారణం ఉంది.

నంద‌మూరి బాల‌కృష్ణ పూరీకి పైసా వ‌సూల్ సినిమా రిలీజ్‌కు ముందు మ‌రో సినిమాకు క‌మిట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ అయిన త‌ర్వాత రిజ‌ల్ట్ చూసిన బాల‌య్య సైలెంట్ అయిపోయారు. అయితే మ‌రో ప‌క్క బోయ‌పాటి శ్రీ‌ను విన‌య విధేయ రామకు ముందు ప‌క్కా క‌మిట్మెంట్‌తో ఇచ్చినా బాల‌య్య దాని డిజాస్ట‌ర్ రిజల్ట్ తో పాటు… బోయపాటి శీను పెట్టించిన భారీ బడ్జెట్ కూడా కళ్ళముందు కనిపించడంతో వేరే కథతో చేద్దామని అయ‌న‌ను పెండింగ్ లో పెట్టేశాడు.

అయితే ఇప్పుడు మరోసారి బాలయ్య ముందు పూరి ప్రపోజల్ పెట్టాడట. దానికి బాల‌య్య స‌మాధానంగా ఇస్మార్ట్ శంక‌ర్ హిట్ కొడితేనే ఛాన్స్ ఇస్తాన‌ని అన్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. మ‌రి ఇదే ఫార్ములా బోయ‌పాటి శ్రీ‌నుకు కూడా వ‌ర్తిస్తుంది. ఇక వీరిద్ద‌రిని ప‌క్క‌న పెట్టిన బాల‌కృష్ణ కెఎస్ రవికుమార్‌తో మాత్రమే సెట్స్ పైకి వెళ్లాడు. మ‌రి ఇస్మార్ట్ శంక‌ర్‌పై ఆశ‌లు పెట్టుకున్న పూరీ హిట్ కొడితే బాల‌య్య‌తో మ‌రో సారి సినిమా చేయాల‌న్న కోరిక నెర‌వేరుతుందో ? లేదో చూడాలి.

Leave a comment