అడివి శేష్ ఎవరు.. ఆ సినిమా మక్కీకి మక్కీ దించారా..!

యువ హీరో అడివి శేష్ తన మొదటి సినిమా నుండి ప్రయోగాలకు పెద్ద పీఠ వేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ గూఢచారి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న అడివి శేష్ లేటెస్ట్ గా ఎవరు సినిమాతో వస్తున్నాడు. ఈమధ్యనే ఈ సినిమా పోస్టర్ రిలీజైంది. టైటిల్ పోస్టర్ చూడగానే ఈ సినిమా కథ కాపీ అంటూ వార్తలు మొదలు పెట్టారు. అడివి శేష్ ఎవరు పోస్టర్ లో అద్దంలో రెజినా కనిపించేలా పోస్టర్ వచ్చింది.

అయితే ఈ పోస్టర్ చూసి ఇది స్పానిష్ మూవీ ది ఇన్ విజిబుల్ గెస్ట్ అనే సినిమాకు స్పూర్తిగా తెరకెక్కించారా.. లేక ఆ సినిమాను కాపీ చేశారా అంటూ వార్తలు వస్తున్నాయి. అడివి శేష్ ఏ సినిమా చేసినా అందులో విషయం ఉంటుంది. తప్పకుండా ఎవరు కూడా ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. ది ఇన్ విజిబుల్ గెస్ట్ సినిమాకు ఎవరుకి సంబంధం ఏంటి అన్నది సినిమా రిలీజ్ అయితేనే కాని చెప్పగలం.

వెంకట్ రాంజీ డైరక్షన్ లో వస్తున్న ఎవరు సినిమాలో అడివి శేష్ కు జోడీగా రెజినా నటిస్తుంది. పివిపి బ్యానర్ లో వస్తున్న ఈ సినిమా ఆగష్టు 15న రిలీజ్ ఫిక్స్ చేశారు. అసలైతే ఆ డేట్ కు ప్రభాస్ సాహో రిలీజ్ కావాల్సి ఉంది. అయితే సాహో ఆగష్టు 30న రిలీజ్ అని తెలియడంతో అడివి శేష్ ఎవరు సినిమా ముందుకొచ్చింది.

Leave a comment