ఇస్మార్ట్ శంకర్ పబ్లిక్ టాక్..! హిట్టా..ఫట్టా..

పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఎనర్జిటిక్ స్టార్ హీరోగా వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఛార్మి, పూరి నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమాలో నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. ఈరోజు రిలీజైన ఈ సినిమా పబ్లిక్ టాక్ సూపర్ అనేలా ఉంది. ఇన్నాళ్లకు పూరి అదిరిపోయే హిట్ అందుకున్నాడని అంటున్నారు. టెంపర్ తర్వాత హిట్టు సినిమా కోసం ప్రయత్నిస్తున్న పూరి రాం తో ఇస్మార్ట్ శంకర్ చేశాడు.

ఇక ఈ సినిమా పబ్లిక్ టాక్ పాజిటివ్ గా ఉంది. రాం యాక్టింగ్, పూరి టేకింగ్ తో పాటుగా ఊర మాస్ ఆడియెన్స్ కు ఈ సినిమా తెగ నచ్చేస్తుందని తెలుస్తుంది. అయితే డబుల్ దిమాక్ డబుల్ హంగామాతో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముందునుండి ఈ సినిమా విషయంలో పూరి చాలా కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. రాం కూడా పూరిని పొగడ్తలతో ముంచెత్తాడు.

ఫైనల్ గా పూరికి చాలా రోజుల తర్వాత ఓ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన పూరి మళ్లీ ఇన్నాళ్లకు ఫాం లోకి రావడం పట్ల ఆయన ఫ్యాన్స్ సంతోషంగా ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ ఇస్మార్ట్ హిట్ అందుకోగా మరి ఈ సినిమా కలక్షన్స్ రేంజ్ ఎంతన్నది తెలియాల్సి ఉంది.

Leave a comment