అఖిల్ – చైతుకు నాగార్జున వార్నింగ్‌… అక్కినేని ఫ్యామిలీలో ఏం జ‌రుగుతోంది…

అక్కినేని కుటుంబంలో ఇటీవల కాలంలో నాగార్జున, నాగచైతన్య కు కాలం కలిసి వస్తుంటే అఖిల్ కు మాత్రం బ్యాడ్ టైం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. పెళ్లి తర్వాత కూడా నాగచైతన్య – సమంత చేస్తున్న సినిమాలు హిట్ అవుతున్నాయి. సమంత – చైతు కలిసి చేసిన మ‌జిలీ సూపర్ హిట్ అయితే సమంత లేడి ఓరియెంటెడ్ రోల్ చేసిన ఓ బేబి దూసుకుపోతోంది. ఇక నాగార్జున నటిస్తున్న మ‌న్మ‌థుడు 2 సినిమాకు సైతం ఎక్కడ లేని క్రేజ్ వస్తోంది. గత ఏడాది అయితే టోట‌ల్‌ అక్కినేని ఫ్యామిలీని బ్యాడ్ టైం వెంటాడింది.

నాగార్జున నటించిన ఆఫీసర్, దేవదాసు నిరాశపరిచాయి. చైతు చేసిన స‌వ్యాసాచిది అదే ప‌రిస్థితి. ఇక అఖిల్ ఈ ఏడాది ఆరంభంలో చేసిన మిస్ట‌ర్ మ‌జ్ను అట్టర్ ఫ్లాప్. ఈ యేడాది మాత్రం చైతు, నాగ్ ప‌ర్వాలేద‌నిపిస్తే అఖిల్ నాలుగో సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో తెలియ‌ని ప‌రిస్థితి. ఇదిలా ఉంటే చైతు, అఖిల్ సినిమా సినిమా కెరీర్‌పై తొలి నుంచి ఆందోళనతో ఉన్న నాగార్జున ఈసారి మాత్రం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. అఖిల్‌కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని నాగ్‌ ఇప్పటికే చేసిన మూడు ప్రయత్నాలు ఫెయిల్ అయ్యాయి.

ఈ క్రమంలోనే ప్రస్తుతం చైతు…. అఖిల్‌ చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. హడావిడిగా సెట్ లోకి వెళ్లి డైరెక్టర్ చెప్పింది చేయడం కంటే సినిమా కథలు ఎంచుకునే విషయంలో జాగ్రత్త‌లు తీసుకోమ‌ని వార‌సుల‌కు సూచిస్తున్నాడ‌ట‌. ఇక సినిమా ఫలితంతో సంబంధం లేకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలు ఎంచుకోవాలని సూచించాడట. సమంత మంచి క్రేజ్ తెచ్చుకోవ‌డానికి ప్రధాన కారణం ఇదే అని… ఓ బేబీ ఎందుకు హిట్ అయ్యిందో మీకు అర్థం కావడం లేదా ?ఇక నుంచి అయినా సరైన కథలు ఎంచుకోవడంతో పాటు… నటనకు స్కోప్ ఉండే పాత్ర చేయమని సీరియస్‌గా సూచించాడట. మరి తండ్రి మాటను ఈ అక్కినేని వారసులు ఎంత సీరియస్గా తీసుకుంటారో ?చూడాలి.

Leave a comment