టాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఆర్.ఆర్.ఆర్ ఓవర్సీస్ డీల్..?

రాజమౌళి డైరక్షన్ లో ఎన్.టి.ఆర్, చరణ్ చేస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. కొమరం భీం గా తారక్. అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ ఒక హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇక సెకండ్ హీరోయిన్ గా సాయి పల్లవిని మాట్లాడుతున్నారట.

ఇదిలాఉంటే ఈ సినిమాకు ఓవర్సీస్ 70 కోట్ల దాకా డిమాండ్ చేస్తున్నాడట నిర్మాత దానయ్య. సాహో సినిమాకు దుబాయ్ డిస్ట్రిబ్యూటర్స్ 66 కోట్లతో ఓవర్సీస్ డీల్ సెట్ చేసుకున్నారట. అయితే దానయ్య ఆర్.ఆర్.ఆర్ సినిమాకు మరో 4 కోట్లు అదనంగా చార్జ్ చేస్తున్నాడట. చరణ్, ఎన్.టి.ఆర్, రాజమౌళి ముగ్గురు కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి కచ్చితంగా ఈ సినిమా సంచలనం సృష్టించడం ఖాయమని అంటున్నారు.

ఓవర్సీస్ ఒక్కటే 70 కోట్ల దాకా వస్తే ఇక తెలుగు రెండు రాష్ట్రాల్లో.. డిజిటల్, శాటిలైట్ రైట్స్ లో ట్రిపుల్ ఆర్ బిజినెస్ రచ్చ చేస్తుంది. 2020 సమ్మర్ రిలీజ్ టార్గెట్ తో వస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా బాహుబలి రికార్డులను సైతం కొల్లగొడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఆర్.ఆర్.ఆర్ ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

Leave a comment