నువ్వు షర్ట్ విప్పితే నేను ఫ్యాంట్ విప్పుతా..!

సినిమా ప్రమోషన్స్ పీక్స్ కు వెళ్తే ఎలా ఉంటుందో బాలీవుడ్ వాళ్లని చూస్తే తెలుస్తుంది. అయితే ఆ గాలి మనకు సోకిందని చెప్పొచ్చు. హిప్పి ప్రమోషన్స్ లో పోటీ పడి మరి ఒంటి మీద బట్టలు విప్పేస్తున్నారు. అయితే అక్కడ హీరోయిన్స్ కూడా అలా చేస్తారు. ఇక్కడ హీరోలు మాత్రమే చేస్తున్నారు. ఏం చేసైనా సరే సినిమా మీద ఆడియెన్స్ లో బజ్ ఏర్పడాలన్న తపనతో హిప్పి సినిమా ప్రమోషన్స్ సాగుతున్నాయి. ఆరెక్స్ 100 సినిమాతో హిట్ అందుకున్న కార్తికేయ హిప్పితో వస్తున్నాడు.

ఈ సినిమాలో జెడి చక్రవర్తి కూడా నటించారు. కార్తికేయకు సలహా దారుడి పాత్రలో జెడి నటించారు. అయితే హిప్పి ప్రమోషన్స్ లో జెడి ప్రవర్తనకు విమర్శలు వస్తున్నాయి. ప్రమోషన్స్ లో భాగంగా హీరో కార్తికేయ షర్ట్ విప్పగా నువ్వు షర్ట్ విప్పితే నేనేమైనా తక్కువ తిన్నానా అంటూ ఫ్యాంట్ విప్పేశాడు జెడి చక్రవర్తి. సీనియర్ హీరో ఇలా చేయడంతో ప్రమోషన్స్ లో పాల్గొన్న మీడియా వళ్లు అవాక్కయ్యారు.
1
ఇప్పటికే బాలీవుడ్ సినిమాలకు ధీటుగా అడల్ట్ కంటెంట్ సినిమాలు చేస్తున్న టాలీవుడ్ లో ఇక అక్కడ ప్రమోషన్స్ కూడా వస్తే సినిమా వాళ్ల మీద ఉన్న గౌరవం తగ్గే అవకాశం ఉంది. మరి జెడి వేసిన రాంగ్ స్టెప్ వల్ల ఆయన్ను చాలామంది విమర్శిస్తున్నారు. సినిమాలో జెడి ఎలా చేశాడో ఏమో కాని ప్రమోషన్స్ లో మాత్రం అతి చేస్తున్నాడని చెప్పొచ్చు.

Leave a comment