ఆర్.ఆర్.ఆర్ ఆమె వల్లే డిలే అవుతుందట..?

ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ సినిమా ప్రస్తుతం రెండు షెడ్యూళ్లను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ కు సంబందించిన ఫైట్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అయితే ఈ షెడ్యూళ్ లో పాల్గొనాల్సిన అలియా భట్ మాత్రం షూటింగ్ కు రాలేదట. సిక్ అవడం వల్ల ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కు అలియా కూడా డుమ్మా కొట్టిందట. ఇప్పటికే సినిమా నుండి డైసీ ఎడ్గర్ జోన్స్ బయటకు రాగా సినిమా కొద్దిరోజులు క్యాన్సిల్ అయ్యింది.

అయితే ఆమె బదులు నిత్యా మీనన్, సాయి పల్లవిల పేర్లు వినపడినా ఎవరు ఫైనల్ అన్నది తెలియలేదు. ఇప్పటికే రాం చరణ్ కు గాయమవడం.. ఎన్.టి.ఆర్ చేతి మణికట్టు డ్యామేజ్ అవడంతో సినిమా షూటింగ్ పోస్ట్ పోన్ అయ్యింది. అయితే ఇలా షూటింగ్ వాయిదా వేసుకుంటూ పోతే 2020 జూలై 30న రిలీజ్ అనుకున్న ఆర్.ఆర్.ఆర్ ఆ టైం కు రిలీజ్ చేసే అవకాశం ఉండదు. అయితే సినిమా లేటైనా సరే రాజమౌళి మాత్రం బాహుబలిని మించేలా ఈ సినిమా తీర్చిద్దుతున్నాడట.

ఆర్.ఆర్.ఆర్ సినిమా ఎనౌన్స్ మెంట్ చేసిన దగ్గర నుండి సినిమాపై వచ్చిన ఏ చిన్న వార్త అయినా సంచలనంగా మారుతుంది. ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి చేస్తున్న రియల్ సూపర్ స్టార్స్ కథ కచ్చితంగా మరో సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. మరి ట్రిపుల్ ఆర్ సందడి ఎలా ఉండబోతుందో చూడాలి.

Leave a comment