అవన్నీ పుకార్లే నమ్మోద్దు : రెజీనా

టాలీవుడ్ లో మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం’, సుబ్రమణ్యం ఫర్ సేల్ లాంటి సినిమాలో హీరోయిన్ గా నటించిన రెజీనా కసండ్ర తర్వాత తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో పలు సినిమాల్లో నటించింది. తక్కువ టైమ్ లో మంచి పేరు తెచ్చుకున్న రెజీనా ఈ మద్య కాలంలో సినిమాలు తగ్గడం మొదలయ్యాయి. దాంతో హాట్ ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు మత్తేక్కించేలా చేస్తుంది.

ఇదిలా ఉంటే ఈ మద్య రెజీనా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ నెల 13వ తేదీన కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ఆమె నిశ్చితార్థం జరిగిందనీ, వచ్చే ఏడాది ఆమె వివాహం జరగనుందనే ప్రచారం జోరుగా జరుగుతోంది. తాజాగా దీనిపై స్పందించిన రెజీనా..వామ్మో వారం రోజుల్లో నా పెళ్లా..ఈ ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. నాకు నిశ్చితార్థం జరగలేదు .. పెళ్లి తేదీ ఫిక్స్ కాలేదు.

ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో .. ఎందుకు పుట్టిస్తున్నారో అర్థం కావడం లేదు. అయినా నాకు ఎంగేజ్ మెంట్ జరిగితే బహిరంగానే చెబుతాను..దాపరికం ఎందుకని ప్రశ్నిస్తుంది. నిజంగానే నాకు పెళ్లి కుదిరితే ఆ విషయాన్ని నేనే స్వయంగా తెలియజేస్తాను .. అప్పటివరకూ ఇలాంటి పుకార్లు నమ్మొద్దు అని చెప్పుకొచ్చింది.

Leave a comment