లేటు వ‌య‌స్సులో ఘాటు స‌ర‌సాలు చూశారా…హీరోయిన్‌ ఎవరో తెలిస్తే షాకె.?

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున తాజా చిత్రం మన్మధుడు 2 టీజర్ తాజాగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. మన్మథుడు 2 అంటే తెలుగు సినిమా ప్రేక్షకులకు నాగార్జున గుర్తుకు తెస్తాడు. 2002 డిసెంబర్లో రిలీజ్ అయిన మన్మధుడు నాగార్జునకు తెలుగు సినిమా ప్రేక్ష‌కుల్లో తిరుగులేని రొమాంటిక్ హీరో అన్న ఇమేజ్ వ‌చ్చేలా చేసింది. ఇప్పుడు 17 సంవత్సరాలకు ఆ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న మన్మ‌ధుడు 2 టీజ‌ర్ బాగా ముదురు వయసు ఉన్న బ్రహ్మచారి పాత్రలో నటిస్తున్నాడని చెప్పేసింది. ముదురు వయసులో ఉన్న నాగార్జున పెళ్లి కోసం ఆయన కుటుంబ సభ్యులు… అక్కా చెల్లెళ్లు… అమ్మ ఇంకా పెళ్లి కాని బ్రహ్మచారి అంటూ ఆట పట్టిస్తుంటే మనోడు మ‌న్మ‌ధుడిగా మారిపోతే ఎలా ఉంటుందో అదే మ‌న్మ‌ధుడు 2 స్టోరీ లైన్‌.

టీజ‌ర్‌లో కావాల్సినంత కామెడీతో పాటు రొమాంటిక్ సీన్లు కూడా ద‌ట్టించేశాడు. టీజ‌ర్‌లో లాస్ట్ డైలాగ్ “ఐ డోంట్ ఫాల్ ఇన్ లవ్.. ఐ మేక్ లవ్” మాత్రం కొంతమందికి అర్థం అయినట్టు లేదు. వాస్త‌వంగా దీని అర్థం ఏంటంటే ” నేను ప్రేమలో పడను. సెక్స్ మాత్రమే చేస్తాను ” అని. ఈ లెక్కన మ‌న్మ‌ధుడు 2లో కూడా కావాల్సినంత బోల్డ్‌నెస్ ఉంటుంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌న్మ‌ధుడు సినిమాలో అమ్మాయిల‌ను ద్వేషించే రోల్‌లో నాగార్జున క‌నిపిస్తాడు. సీక్వెల్‌లో పెళ్లికాక ప‌డే ఇబ్బందులు, అటు ఫ్రెండ్స్ వేధింపులు, ఇటు పెళ్లి చేసుకోమ‌ని కుటుంబ స‌భ్యులు పెట్టే టార్చ‌ర్ దెబ్బ‌తో చివ‌ర‌కు కాస‌నోవా మారి అమ్మాయిల‌తో రొమాన్స్ చేసే క్యారెక్ట‌ర్‌లో నాగ్ క‌నిపించాడ‌ని తెలుస్తోంది. ఇక సినిమాలో లిప్ లాక్ సీన్ల‌కు కూడా కొద‌వ‌లేదు. ర‌కుల్‌తో ప్రేమ వ్య‌వ‌హారాలు ఓ ప‌క్క‌న న‌డుపుతూనే కొంద‌రు అమ్మాయిల‌తో లిప్‌లాక్‌లు కూడా లాగించేస్తాడు.

టీజ‌ర్‌లో నాగ్ ఓ భామ‌కు హాట్‌హాట్‌గా లిప్‌లాక్‌లు ఇస్తాడు. ఈ అమ్మాయి ఎవ‌రు అన్న‌ది ఇప్పుడు ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌డం లేదు. కొంద‌రు మాత్రం మ‌న్మ‌ధుడు 2లో న‌టిస్తోన్న బెంగ‌ళూరు భామ అక్ష‌ర‌గౌడ అని సోష‌ల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా లేటు వ‌య‌స్సులో అక్కినేని మ‌న్మ‌ధుడు ఘాటు స‌ర‌సాలు ఎలా ఉంటాయో ? నాగ్ మ‌న్మ‌ధుడు 2తో ఆన్ స్క్రీన్ రొమాన్స్‌ను ఎలా పండిస్తాడో ? చూడాలి.

Leave a comment