మహర్షిపై మొహం చాటేసిన హీరో.. పాపం ఫ్యాన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ ఇటీవల విడెదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లు రాబడుతోండగా.. ఓవర్సీస్‌ బయ్యర్లకు మాత్రం నష్టాన్ని మిగిలించింది. ఇక ఈ సినిమా రీమేక్ ముచ్చట్ల కోసం అప్పుడే సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాధారణంగా మహేష్ సినిమాలను ఎక్కువగా బాలీవుడ్‌లో రీమేక్ చేస్తుంటారు దర్శకనిర్మాతలు.

ఇక మహేష్ నటించిన పోకిరి వంటి సినిమా రీమేక్‌తో బ్లాక్‌బస్టర్ అందుకున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం మహర్షి ఊసే ఎత్తడం లేదు. సల్లూ భాయ్ నటిస్తోన్న తాజా చిత్రం భారత్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు సల్మాన్ పూర్తిగా లీనమైపోయాడు. అయితే మహర్షి సినిమాను హిందీ రీమేక్ చేస్తున్నారా.. అంటూ ఆయన ఫ్యాన్స్ అడగడంతో.. లేదు.. ఆ సినిమాను రీమేక్ చేయడం లేదని.. కుండ బద్దలుకొట్టాడు సల్మాన్.

దీంతో సల్మాన్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు లోనయ్యారు. మంచి సబ్జెక్ట్ ఉన్న సినిమా కాబట్టి ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మరికొంత మంది మాత్రం సల్మాన్ ఇమేజ్‌కు ఈ సినిమా సెట్ కాదులే అంటూ లైట్ తీసుకుంటున్నారు.

Leave a comment