సొంత రికార్డును పాతరపెట్టిన మహేష్.. మహర్షి 18 డేస్ కలెక్షన్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘మహర్షి’ మే 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూసిన మహేష్ ఫ్యాన్స్ సినిమాను చూసి ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇక ఈ సినిమా అన్ని రికార్డులను కాలరాయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దీనికి తోడు మహర్షి సినిమా తరువాత చెప్పుకోతగ్గ పెద్ద సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా తన సత్తా చాటుతూనే ఉంది.

ఔట్ అండ్ ఔట్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మహర్షి చిత్రం 18 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.94.08 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ కలెక్ట్ చేసింది. ఈ చిత్రం మరో రూ.50 లక్షలు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుంటుంది. ఇదే క్రమంలో మహేష్ తన సొంత రికార్డును పాతర వేయనున్నాడు. భరత్ అనే నేను చిత్రం టోటల్ షేర్ కలెక్షన్ రూ.94.80 కోట్లను మహర్షి టోటల్ రన్‌లో కలెక్ట్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏరియాల వారీగా ఈ చిత్రం 18 డేస్ కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

ఏరియా – 18 డేస్ కలెక్షన్లు
నైజాం: 27.67 కోట్లు
సీడెడ్: 9.05 కోట్లు
గుంటూరు: 7.39 కోట్లు
ఉత్తరాంధ్ర: 9.47 కోట్లు
కృష్ణా: 5.31 కోట్లు
వెస్ట్ గోదావరి: 5.41 కోట్లు
ఈస్ట్ గోదావరి: 6.76 కోట్లు
నెల్లూరు: 2.57 కోట్లు
ఏపీ+తెలంగాణ: రూ.73.63 కోట్లు
ఓవర్సీస్: 10.20 కోట్లు
రెస్టాఫ్ ఇండియా: 10.25 కోట్లు
టోటల్ వరల్డ్‌వైడ్: రూ.94.08 కోట్లు

Leave a comment