ఓటర్‌కు మంచు విష్ణు ఝలక్

Manchu Vishnu Gives Legal Notice To Voter Team

మంచు విష్ణు ఇటీవల సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. కాగా తన నెక్ట్స్ మూవీ కోసం రెడీ అవుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మధ్యలో అతడు నటించిన ఓ సినిమా అప్‌డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకీ ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్ ఏమిటని అనుకుంటున్నారా.. మరేం లేదు… మనోడు ఈ సినిమా దర్శకనిర్మాతలపై కోర్టు నోటీసులు పంపించాడు.

మంచు విష్ణు నటించిన ఓటర్ అనే చిత్రం అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. కానీ ఈ సినిమా రిలీజ్ మాత్రం అనుకున్న డేట్‌కు కాలేదు. దీంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చిత్ర యూనిట్‌తో పాటు విష్ణు కూడా వెయిట్ చేశాడు. అయితే ఎంతకీ ఈ సినిమా రిలీజ్ కాకపోవడంతో మనోడు చేసేది ఏంలేక నేరుగా కోర్టు మెట్లు ఎక్కాడు. ఈ సినిమా దర్శకుడు కార్తీక్ రెడ్డితో పాటు నిర్మాత సుధీర్ కూడా మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ చిత్ర హక్కులను విష్ణుని తీసుకోమని చెప్పారు. అయితే వారు చెప్పిన విధంగానే మనోడు సినిమా రైట్స్‌ను వారికి ఇప్పించాడు. అయితే మనోడి చేతుకి వాళ్లు క్రీమ్ బిస్కెట్ ఇవ్వడంతో వేరే దిక్కులేక కోర్టును ఆశ్రయించాడు విష్ణు.

తనను మోసం చేసిన ఓటర్ చిత్ర దర్శకనిర్మాతలపై కఠిన చర్యలు తీసుకోవాలని విష్ణు కోరుతున్నాడు. విషయం తెలుసుకున్న మంచు ఫ్యాన్స్.. అయ్యో పాపం అనడం తప్పితే ఇంకేమీ చెయ్యలేకపోతున్నారు.

Leave a comment