తప్పతాగి రోడ్డు మీద విధ్వంసం సృష్టించిన హీరోయిన్..!

మోడల్ కమ్ టివి యాక్ట్రెస్ రుషి సింగ్ సోమవారం రాత్రి తప్పతాగి రోడ్డు మీద చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాగి డ్రైవ్ చేయడమే కాకుండా రోడ్ సైడ్ ఉంటే ఫుడ్ కోర్ట్ వారితో గొడవ కూడా పడిందట. వారిని దుర్భాషలాడడంతో పోలీసులకు ఫోన్ చేశారట. తాగి డ్రైవ్ చేయడమే కాకుండా న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు గాను.. రుషి సింగ్ మీద ఐపీసీ సెక్షన్ 323, సెక్షన్ 332, సెక్షన్ 504, సెక్షన్ 510, సెక్షన్ 34 కింద కేసు నమోదు చేశారు.
1
గ్లామర్ ఫీల్డ్ లో ఇదంతా కామనే కాని తాగామా సైలెంట్ గా ఉన్నామా అని కాకుండా ఓన్ డ్రైవింగ్ చేయడంతో పాటుగా ఇతరులను ఇబ్బంది పెట్టడం మాత్రం ఏమి బాగాలేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ కింద కేసు బుక్ చేసి ఆల్రెడీ ఆమె కారుని సీజ్ చేశారట. ఈ ఆరోపణల మీద రుషి సింగ్ ఇప్పటివరకు స్పందించలేదు.

ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కాని పోలీసులతో కాదు కాని అమ్మడు మాత్రం పోయి పోయి పోలీసులతోనే ఆటాడుకుంది. తాగిన మైకంలో పోలీసులతో కూడా గొడవ పడ్డదట రుషి సింగ్. కచ్చితంగా ఆమె తాగిన మత్తు దిగేలా గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.

Leave a comment